పంచతంత్రం: దేవి.. సదాసీదా అమ్మాయి

ABN , First Publish Date - 2021-09-06T01:47:52+05:30 IST

బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతిరెడ్డి, శివాత్మిక రాజశేఖర్‌, రాహుల్‌ విజయ్‌, నరేష్‌ అగస్త్య, దివ్య శ్రీపాద కీలక పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘పంచతంత్రం’. హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అఖిలేష్‌ వర్థన్‌, సృజన్‌ ఎరబోని నిర్మాతలు.

పంచతంత్రం: దేవి.. సదాసీదా అమ్మాయి

బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతిరెడ్డి, శివాత్మిక రాజశేఖర్‌, రాహుల్‌ విజయ్‌, నరేష్‌ అగస్త్య, దివ్య శ్రీపాద కీలక పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘పంచతంత్రం’. హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అఖిలేష్‌ వర్థన్‌, సృజన్‌ ఎరబోని నిర్మాతలు. ఇందులో దివ్య శ్రీపాద దేవి పాత్ర పోషిస్తున్నారు. ఆదివారం ఆమె పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ''కొత్తగా పెళ్లై సాధారణ మధ్య తరగతి కుటుంబంలోకి అడుగుపెట్టిన దేవి క్యారెక్టర్‌లో దివ్య కనిపిస్తారు. సినిమాకు ఆమె పాత్ర కీలకం. సదాసీదాగా, అమాయకంగా కనిపించే దేవి... ఇంటికి, తనకు కష్టం వచ్చినప్పుడు కుటుంబం కోసం పోరాడే క్రమంలో ధైర్యం కనిపిస్తుంది. కుటుంబ బాధ్యత మోసే పాతికేళ్ల ప్రతి ఆడపిల్ల దేవి పాత్రలో తమను తాము చూసుకుంటారు’’ అని అన్నారు. ుూచిత్రీకరణ దాదాపుగా పూర్తి కావొచ్చింది. డబ్బింగ్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నవంబర్‌ లేదా డిసెంబర్‌ లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని నిర్మాతలు అన్నారు. 


Updated Date - 2021-09-06T01:47:52+05:30 IST