సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కొవిడ్‌ సాయం కోసం పెయింటింగ్‌ వేలం!

ABN, First Publish Date - 2021-05-04T10:24:01+05:30

సత్యజిత్‌ రే (రాయ్‌) శతజయంతి (మే 2) సందర్భంగా ‘100 ఇయర్స్‌ ఆఫ్‌ సత్యజిత్‌ రే’ పేరుతో కథానాయిక శ్వేతా బసు ప్రసాద్‌ ఓ పెయింటింగ్‌ వేశారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సత్యజిత్‌ రే (రాయ్‌) శతజయంతి (మే 2) సందర్భంగా ‘100 ఇయర్స్‌ ఆఫ్‌ సత్యజిత్‌ రే’ పేరుతో కథానాయిక శ్వేతా బసు ప్రసాద్‌ ఓ పెయింటింగ్‌ వేశారు. కొవిడ్‌ బాధితుల సహాయార్ధం దానిని ఆన్‌లైన్‌లో వేలం వేస్తున్నారు. ‘‘కొవిడ్‌ ఫండ్స్‌ కోసం ఈ పెయింటింగ్‌ను వేలం వేస్తున్నా. నేను పెయింటింగ్‌లో శిక్షణ తీసుకోలేదు. నాకు నేనే స్వయంగా నేర్చుకున్నా. అందుకని, నా ప్రయత్నాన్ని మన్నించండి. నేను ఆర్టిస్ట్‌ని. ఇంటి దగ్గర కూర్చుని ఏ విధంగా సహాయం చేయాలో తెలియలేదు. పెయింటింగ్‌ వేలం వేయడం ద్వారా వచ్చిన డబ్బును కొవిడ్‌ బాధితులు, వైద్య సిబ్బంది, వాళ్ల కుటుంబాలకు ఇవ్వాలనుకుంటున్నాను. సామాన్యుడి గురించి సత్యజిత్‌ రే చిత్రాలు చేశారు. ఆయన శతజయంతికి ఈ విధంగా చేయడం మంచిదని అనుకుంటున్నాను’’ అని శ్వేతా బసు ప్రసాద్‌ పేర్కొన్నారు. వేలంలో పెయింటింగ్‌ ధరను రూ. 50 వేలుగా నిర్ణయించారు. ఒకరు రూ. లక్ష ఇస్తామని బిడ్డింగ్‌ వేశారు. మరో మూడు రోజులు వేలం కొనసాగుతుందని సోమవారం శ్వేతా బసు ప్రసాద్‌ తెలిపారు.

Updated Date - 2021-05-04T10:24:01+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!