మాది పక్కా కమర్షియల్‌ సినిమా

ABN , First Publish Date - 2021-01-18T10:44:01+05:30 IST

‘‘సినిమాలో మా అబ్బాయి ఓవర్‌ యాక్షన్‌ చేశాడంటున్నారు. అలా చేేస్తనే కదా సూపర్‌ హిట్‌ అవుతుంది. మేం తీసింది...

మాది పక్కా కమర్షియల్‌ సినిమా

‘‘సినిమాలో మా అబ్బాయి ఓవర్‌ యాక్షన్‌ చేశాడంటున్నారు. అలా చేేస్తనే కదా సూపర్‌ హిట్‌ అవుతుంది. మేం తీసింది ‘శంకరాభరణం’, ‘సప్తపది’ కాదు. పక్కా కమర్షియల్‌ సినిమా. నిర్మాతకు లాభాలు రావడం ముఖ్యం. ఈ చిత్రం డెఫినెట్‌గా రూ.50 కోట్ల క్లబ్‌లో చేరుతుంది’’ అని బెల్లంకొండ సురేశ్‌ అన్నారు. ఆయన తనయుడు సాయి శ్రీనివాస్‌ హీరోగా నటించిన ‘అల్లుడు అదుర్స్‌’ సక్సెస్‌ మీట్‌ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. సోనుసూద్‌ చిత్ర బృందానికి షీల్డ్‌లు అందజేశారు. బెల్లంకొండ సురేశ్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా బడ్జెట్‌ రూ.32 కోట్లు. విడుదలైన మూడు రోజుల్లో పది కోట్ల షేర్‌ వచ్చింది. శాటిలైట్‌, ఆడియో రైట్స్‌ కలిపి రూ.21 కోట్లు వచ్చాయి. ఇకపై వచ్చేదంతా ప్రాఫిట్‌ అవుతుంది. ‘క్రాక్‌’ చిత్రానికి దిల్‌ రాజు థియేటర్లు ఇవ్వడం లేదని డిస్ట్రిబ్యూటర్‌ వరంగల్‌ శ్రీను చేసిన ఆరోపణలు అవాస్తవాలు. దిల్‌ రాజు, శిరీశ్‌ గురించి మాట్లాడే అర్హత అతనికి లేదు’’ అని అన్నారు. ‘‘సంక్రాంతికి అందరూ కుటుంబ కథా చిత్రం చూడాలనుకుంటారు. సంతోష్‌ శ్రీనివాస్‌ అటువంటి సినిమా చేసి, సంక్రాంతి బరిలో విజయం అందించారు’’ అని నిర్మాత గొర్రెల సుబ్రహ్మణ్యం అన్నారు. ‘‘సినిమా బాగా ఆడుతుందంటే సాయి శ్రీనివాసే కారణం. హిట్‌ క్రెడిట్‌ అంతా తనకే దక్కుతుంది’’ అని దర్శకుడు చెప్పారు. ‘‘ప్రేక్షకులను నవ్వించడానికి జెన్యున్‌గా ఈ సినిమా చేశాం. అంతే జెన్యూన్‌గా సినిమా విజయం సాధించింది’’ అని హీరో సాయి శ్రీనివాస్‌ అన్నారు. 

Updated Date - 2021-01-18T10:44:01+05:30 IST