‘ఒరేయ్ బామ్మర్ది’ టీజర్ విడుదల

ABN , First Publish Date - 2021-04-09T22:27:13+05:30 IST

లవర్ బాయ్‌గా తెలుగు ప్రేక్షకులు పిలుచుకున్న హీరో సిద్ధార్థ్ , సంగీత దర్శకుడిగా మంచి పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్న జీవీ ప్రకాష్ కుమార్‌లు హీరోలుగా 'బిచ్చగాడు' వంటి సూపర్ హిట్

‘ఒరేయ్ బామ్మర్ది’ టీజర్ విడుదల

లవర్ బాయ్‌గా తెలుగు ప్రేక్షకులు పిలుచుకున్న హీరో సిద్ధార్థ్ , సంగీత దర్శకుడిగా మంచి పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్న జీవీ ప్రకాష్ కుమార్‌లు హీరోలుగా 'బిచ్చగాడు' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన శశి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఒరేయ్ బామ్మర్ది'. కశ్మీర పరదేశి, లిజోమోల్ జోస్ లు హీరోయిన్ గా నటిస్తున్నారు. అభిషేక్ ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కిన ఈ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాకి రమేష్ పి పిళ్లై నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. కాగా ఈ సినిమాని శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ పై ఏ.ఎన్ బాలాజీ ఈ నెలలో తెలుగులో విడుదల చేయనున్నారు. సిద్ధూ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి ప్రసన్న కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ కుమార్ ల మధ్య కాంబినేషన్ లో వచ్చే యాక్షన్ చిత్రాలు ఈ చిత్రానికి హైలైట్‌గా ఉంటాయని చిత్రయూనిట్‌ చెబుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రాగా, తాజాగా ఈ సినిమా టీజర్ గ్లింప్స్‌ని చిత్రయూనిట్‌ విడుదల చేసింది. ఈ గ్లింప్స్‌ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది. హీరో సిద్దార్థ్‌ ఓ పవర్‌ ఫుల్‌ రోల్‌లో నటించినట్లుగా తెలుస్తుంది.


ఇక ఈ టీజర్‌ గ్లింప్స్ విడుదల సందర్భంగా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్  ఏ.ఎన్ బాలాజీ మాట్లాడుతూ.. సిద్ధార్థ్, జీవిప్రకాష్ కుమార్‌ కలిసి నటించిన ఈ యాక్షన్ సినిమాని తెలుగులో రిలీజ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుందన్న నమ్మకం ఉంది. ఇద్దరు హీరోలు పోటాపోటీగా సినిమాలో నటించారు. ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ కూడా అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాము.. అన్నారు.

Updated Date - 2021-04-09T22:27:13+05:30 IST