సిద్ధార్థ్, జీవిప్రకాష్ కుమార్ 'ఒరేయ్ బామ్మర్ది' చిత్రం ఫస్ట్ లుక్

ABN , First Publish Date - 2021-04-05T19:32:17+05:30 IST

సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం 'ఒరేయ్ బామ్మర్ది'. ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని నిర్మాత‌లు తెలిపారు.

సిద్ధార్థ్, జీవిప్రకాష్ కుమార్ 'ఒరేయ్ బామ్మర్ది' చిత్రం ఫస్ట్ లుక్

సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం 'ఒరేయ్ బామ్మర్ది'. 'బిచ్చగాడు' లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా కశ్మీర పరదేశి, లిజోమోల్ జోస్  హీరోయిన్లుగా నటించారు. అభిషేక్ ఫిలిమ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని రమేష్ పి పిళ్లై నిర్మించారు..యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా తెరకెక్కిన ఈ చిత్రం  పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాను శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌పై ఏ.ఎన్ బాలాజీ ఈ నెలలో విడుదల చేయనున్నారు. సిద్ధూ కుమార్ సంగీతం అందించగా ప్రసన్న కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని నిర్మాత‌లు తెలిపారు. 

Updated Date - 2021-04-05T19:32:17+05:30 IST