సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సిద్ధార్థ్‌, జీవీ ప్ర‌కాశ్ మ‌ధ్య గొడ‌వేంటి?

ABN, First Publish Date - 2021-08-04T17:14:57+05:30

హీరో సిద్ధార్థ్‌, హీరో క‌మ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ మ‌ధ్య గొడ‌వా? ఎప్పుడు..ఎందుకు? అనే సందేహం రాక‌మాన‌దు. అదేదో తెలుసుకోవాలంటే ‘ఒరేయ్ బామ్మ‌ర్ది’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. బిచ్చగాడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హీరో సిద్ధార్థ్‌, హీరో క‌మ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ మ‌ధ్య గొడ‌వా?  ఎప్పుడు..ఎందుకు? అనే సందేహం రాక‌మాన‌దు. అదేదో తెలుసుకోవాలంటే ‘ఒరేయ్ బామ్మ‌ర్ది’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. బిచ్చగాడు వంటి బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు శశి తెరకెక్కించిన చిత్రం ‘శివప్పు మంజల్ పచ్చై’. అభిషేక్ ఫిలిమ్స్ పతాకంపై రమేష్ పి పిళ్లై నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్‌పై ఏ.ఎన్ బాలాజీ ‘ఒరేయ్ బామ్మర్ది’గా ఆగ‌స్ట్ 13న‌ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా ట్రైల‌ర్‌ను బుధ‌వారం చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. బావ‌(సిద్ధార్థ్‌) ట్రాఫిక్ ఇన్‌స్పెక్ట‌ర్‌.. బామ్మ‌ర్ది(జీవీ ప్ర‌కాశ్‌) బైక్ రేస‌ర్‌.. వీరి మ‌ధ్య వారు చేసిన ప‌నుల వ‌ల్ల ఘ‌ర్ష‌ణలు నెల‌కొంటాయి. అయితే వీరికి మ‌రో కోణం ఎమోష‌న‌ల్ బాండింగ్ ఉంటుంది. మ‌రి ఈ బావ‌, బామ్మ‌ర్దిలు క‌లిసి పోయారా?  లేదా? అనేది తెలియాలంటే మాత్రం సినిమా వీక్షించాల్సిందే.. 



Updated Date - 2021-08-04T17:14:57+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!