ఆట ఇప్పుడే మొదలైంది!

ABN , First Publish Date - 2021-10-18T13:50:03+05:30 IST

పాత్ర ఏదైనా ఆకళింపు చేసుకోవడంలో అతనో మోనార్క్‌. దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ సత్తా చాటిన ప్రకాశ్‌రాజ్‌ ఇటీవల ‘మా’ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ వెంటనే ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేసి.. ‘అసలు ఆట ఇప్పుడే మొదలైంద’ని ప్రకటించారు...

ఆట ఇప్పుడే మొదలైంది!

పాత్ర ఏదైనా ఆకళింపు చేసుకోవడంలో అతనో మోనార్క్‌. దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ సత్తా చాటిన ప్రకాశ్‌రాజ్‌ ఇటీవల ‘మా’ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ వెంటనే ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేసి.. ‘అసలు ఆట ఇప్పుడే మొదలైంద’ని ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి గల కారణాలు, భవిష్యత్తు ఆలోచనలను ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ‘ఓపెన్‌హార్ట్‌ విత్‌ ఆర్కే’ కార్యక్రమంలో ప్రకాశ్‌రాజ్ పంచుకున్నారు. ఆ సంభాషణలు మీకోసం...


నేను ఇప్పుడు ఒకటి చెబుతున్నా. నాకు నిజాయతీగా రావాల్సిన 380 ఓట్లు మీరు తీసుకున్నారు. 280 ఓట్లు వచ్చాయి. నేను బ్యాలెట్‌ పేపర్లు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నా. ప్లయిట్స్‌, టికెట్లు బుక్‌ చేయలేదు. యాక్టివ్‌ మెంబర్స్‌తోనే మాట్లాడుతూ కూర్చున్నా. నేను ఎవరినీ బెదిరించలేదు. చిన్న వాళ్ల ఇంటికి చీర తీసుకెళ్లలేదు. స్వీట్ ప్యాకెట్లు పెట్టలేదు. నాకు వచ్చిన 280 ఓట్లు జెన్యూన్‌.


1981లో వచ్చా. నన్ను పరాయివాడన్నారు. 900 మందిలో 150 మంది ఇన్‌యాక్టివ్‌ మెంబర్లు ఉన్నారు. ఇక్కడ ప్రేమతో రాలేదు. డబ్బులు కట్టించుకుని మెంబర్లు చేశారు. వాళ్లు పెళ్ళిళ్లు చేసుకుని వెళ్లిపోయారు. వాళ్లకు ఈ భాష కూడా రాదు. జెనీలియా లాంటి వాళ్లని ఫ్లయిట్‌ వేసుకుని తీసుకొచ్చారు. వాళ్లకు కృష్ణానగర్‌ సమస్యలు తెలుసా? వాళ్లు సడెన్‌గా అనుకుని వచ్చారా. అది పోల్‌ మేనేజ్‌మెంట్‌. గెలుపు, ఓటమిని ఇలా అర్థం చేసుకోవాలిప్పుడు. నువ్వు సంపాదించిన ఓట్లతో గెలుపు వేరు. గుద్దించుకుని సంపాదించిన ఓట్లతో గెలుపొందడం వేరు. వదిలేద్దాం! లెట్‌ అజ్‌ స్టాక్‌ అబౌట్‌.ఆర్కే: వెల్‌కం టు ఓపెన్‌హార్ట్‌. నమస్కారం ప్రకాశ్‌రాజ్‌ గారూ..

ప్రకాశ్‌రాజ్‌: నమస్కారం సర్‌ఆర్కే: చల్లబడ్డారా?

ప్రకాశ్‌రాజ్‌: నేను ఎప్పుడూ వేడిగా ఉంటాను సర్‌.


ఆర్కే: పరాభవ భారం నుంచి..

ప్రకాశ్‌రాజ్‌: పరాభవం అనేది ఎలా చూడాలి సర్‌? ఓడిపోవడం, గెలవడం అనేది సహజం. జీవితంలో గమ్యం ముఖ్యమైనపుడు లక్ష్యం కనపడకూడదు.


ఆర్కే: మీ గమ్యమేమిటి?

ప్రకాశ్‌రాజ్‌: ఒక దిగంతానికి వచ్చాను. మరో దిగంతం కనపడుతోంది. (నవ్వులు)


ఆర్కే: ‘మా’నుంచి ఎన్ని ‘మా’లు రాబోతున్నాయి?

ప్రకాశ్‌రాజ్‌: మారిన ‘మా’రావాలి. మార్పు నిరంతరమెప్పుడూ. మారకపోతే ఇంకో ‘మా’ వస్తుంది.


ఆర్కే: అంటే ఎవరు మారాలి?

ప్రకాశ్‌రాజ్‌: మనుషులు మారాలి. ఆలోచనలు, అవసరాలు మారాలి. 


ఆర్కే: చీలికలు, పీలికల్లేకుండా ‘మా’ బాగా కొనసాగాలంటే ప్రధానంగా ఎవరిలో మార్పు రావాలి?

ప్రకాశ్‌రాజ్‌: చీలికలు, పీలికలు అంటే ఏంటంటారు?


ఆర్కే: నాగబాబు పీలికలు అన్నారు కదా..

ప్రకాశ్‌రాజ్‌: అంటే కుటుంబం అన్నారు. భిన్నాభిప్రాయాలున్నాయి. భిన్నాభిప్రాయాలొస్తే చీలికలు అంటారు. ఇట్స్‌ రాంగ్‌.


ఆర్కే: భిన్నాభిప్రాయాలు, చీలికలు వేరు కదా..

ప్రకాశ్‌రాజ్‌: వీళ్లు అలానే అంటారు. కుటుంబం అంటారు. ఎలా కుటుంబం అవుతుంది. 


ఆర్కే: అదంతా హిపోక్రసీ!

ప్రకాశ్‌రాజ్‌: అదంతా అబద్ధం అంటున్నాను. మనమంతా ఒకే కుటుంబం. అది నాన్సెన్స్‌. ఒకే కుటుంబం అయితే ఎందుకు సొసైటీ యాక్ట్‌కు వెళ్తారు? ఎందుకు ప్రజాస్వామ్యం తీసుకొస్తారు? ఎన్నికలు తీసుకొస్తారు?


ఆర్కే: కుటుంబ పెద్ద ఏమి చెబితే అది వినాల!

ప్రకాశ్‌రాజ్‌: ఇన్ని సంవత్సరాలు ఏమైంది. కుటుంబం, కుటుంబం.. అనేవాళ్లతో కేర్‌ఫుల్‌గా ఉండాలి మీరు. నిలుచుండే వాళ్ల మధ్య పోటీ ఉండదు. వెనకాల ఎవరున్నారో వాళ్లే ఉండాలి. వెనకుండేవాళ్లు వదలరు. వేరు వేరు రూపంలో వస్తుంటారు. అలా అనేక యుద్ధాలు వస్తుంటాయి. 


ఆర్కే: ఆ యుద్ధాల్లో మీరు పావు అయిపోయారు కదా...

ప్రకాశ్‌రాజ్‌: అలా అనుకుంటున్నారు. కాదంటున్నాను కదా! అనుమానాల్లేవు. నేను పావు కాదు. అది డిస్టర్బింగ్‌ ఫ్యాక్టర్‌. అన్ని పెద్దరికాల్ని ప్రశ్నిస్తున్నాను కదా. ఎటెళ్లినా వీడు డేంజరేనని...


ఆర్కే: అందరినీ ప్రశ్నించినప్పుడు ఫలితం ఇలానే ఉంటుంది కదా...

ప్రకాశ్‌రాజ్‌: ఫలితం ఎలా వచ్చిందని మీరు ఆలోచించాలి.


ఆర్కే: మీ వెనకాల ఎవరూ లేరా?

ప్రకాశ్‌రాజ్‌: ఎవరో ఒకరు నచ్చితే. వాడు వెనకున్నట్లా?


ఆర్కే: నాగబాబు అన్నారు. ‘మా తరఫున ప్రకాశ్‌రాజ్‌ను పెట్టాలనుకుంటున్నాం. మీ కొడుకును విత్‌డ్రా చేయించు’ అని మోహన్‌బాబుకి చిరంజీవి ఫోన్‌ చేశారట కదా..

ప్రకాశ్‌రాజ్‌: విష్ణుగారు చెప్పారు. 


ఆర్కే: కాదు. నాకు మోహన్‌బాబు పర్సనల్‌గా చెప్పారు. 

ప్రకాశ్‌రాజ్‌: నిజం కావచ్చు.. అబద్ధం కూడా కావచ్చు కదా. 


ఆర్కే: అది ఎవరూ ఖండించలేదు కదా..

ప్రకాశ్‌రాజ్‌: చెప్పి ఉంటే చెప్పాను అనాలి. ఎందుకు ముసుగులో అంతా!


కేసీఆర్‌ మీకు పరోక్షంగా సహకరించలేదా...


ఆయనకు వేరే పనిలేదా? ఆయన్ని రెండుసార్లు కలిశా. నేనంటే అభిమానం. ఒకరోజంతా కలిసి మాట్లాడుకున్నాం. గౌరీలంకేష్‌.. ఇలా అన్నీ మాట్లాడినప్పుడు అభినందించారు. కేటీఆర్‌గారు వచ్చే సీఎం. నా నంబర్‌ ఉంది. ఆయన నాకు మెసేజ్‌ చేస్తాడు. అయినంత మాత్రాన నన్ను సపోర్టు చేస్తాడా. ఆయన లెక్కలు ఆయనకుంటాయి. బేసిక్‌గా వీళ్లంతా సెల్ఫీగ్రూపులు. ఏం మాట్లాడాడో.. ఎందుకొచ్చాడని తిట్టారో.. నాకు తెలీదు. అందరికీ ఇలా ఉండాలని చెబుతా అని.. నన్ను ‘బొమ్మరిల్లు ఫాదర్‌’ అంటారు అని కేసీఆర్‌ అని నాతో జోక్‌ చేశారు. అలాగని నాకు ఆయన చాలా క్లోజ్‌ అనుకుంటే నా మెచ్యూరిటీకి సిగ్గేకదా.


ఆర్కే: ఫస్ట్‌ ఎవరి దగ్గరకు వెళ్లారు?

ప్రకాశ్‌రాజ్‌: నేను ఎవరి దగ్గరకు వెళ్లలేదు. మా మెంబర్స్‌తో మాట్లాడా. లాస్ట్‌ టైం నరేష్‌ నిలబడినప్పుడే నిలుచుందాం అనుకున్నా. మనముండే ఇండస్ర్టీనే రచ్చరచ్చగా ఉంటే ఓ బాధ్యత అనేది ఉంటుంది కదండీ. 


ఆర్కే: అవకాశాలు కల్పించడంలోనా.. ఆధిపత్యంలోనా..

ప్రకాశ్‌రాజ్‌: అవకాశాలు కల్పించలేరు. ఇగో.. నేను అధికారంలో ఉండాలని తప్పితే. యు ఆర్‌ నాట్‌ సాల్వింగ్‌ ద ప్రాబ్లమ్‌. మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌ అంటే కుటుంబం అంటారు. దాదాపు యాభైశాతం ఓటింగ్‌కి రారు. మరి ఎలా కుటుంబం అవుతుంది. సరే.. ఆదుకోవాలి. ఎవరు ఎవరిని ఆదుకోవాలి. ఎవడికి వాడు కష్టపడి ప్రొఫెషన్‌లో పైకి వచ్చిన తర్వాత ముట్టుకోరు ఇంకొకరిని.  


ఆర్కే: అసలు సమస్యే అది..

ప్రకాశ్‌రాజ్‌: ఎంతమంది అరవై ఏళ్లు దాటినవాళ్లున్నారు. అసలు మీ దగ్గర డేటా లేదు. మొన్న ఈ ఎలక్షన్‌లో ట్రావెల్‌ అవుతుంటే ఓ పెద్దాయనకు ఫోన్‌ చేశా. తన భార్య చనిపోతే.. పిల్లలు ఓల్డేజ్‌ హోమ్‌లో ఉంచారని చెప్పారు. ఇది తెలియదు వీళ్లకు. పెన్షన్‌ ఓ ముప్ఫయి మందికి ఇస్తున్నారు. కానీ చాలామంది ఉన్నారు. ఇవ్వడానికి డబ్బుల్లేవు. ఓ అసోషియేషన్‌గా సస్టయినబిలిటీ లేదు. ఆదాయమార్గాలు లేవు.


ఆర్కే: మా అసోషియేషన్‌లో డబ్బు ఉందా?

ప్రకాశ్‌రాజ్‌: ఎక్కడుంది సార్‌. నాలుగైదు కోట్లు డబ్బా? ఏమి చేస్తారు అది పెట్టుకుని. అరవై ఏళ్లు దాటినవాళ్లు దాదాపు 15 ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్నారు. వారు 100మంది ఉంటే.. వాళ్లకు పెన్షన్‌ ఇవ్వాలంటే సంవత్సరానికి కోటి ఇరవై లక్షలు కావాలి. ఎక్కడుంది? పొలిటీషియన్లలా 5 వేలను 6వేలు చేయడం. ఎకనామిక్‌ స్ర్టాటజీ లేదు.. దీస్‌ ఆర్‌ ఆల్‌ నాన్సెస్‌.ఆర్కే: ప్రాంతీయవాదం తీసుకొచ్చారు కదా. అయితే మీరు 2018 ఎలక్షన్‌లో కేసీఆర్‌ గెలిచాక చంద్రబాబుకి ఏం పని? అని మీరు నోరు జారారు.

ప్రకాశ్‌రాజ్‌: మీకు అదే వినిపించింది. ఆయనమీద గౌరవం లేదని కాదు. స్టాండ్‌ సిచ్యువేషన్స్‌. ఒక మహామైత్రి కూటమి చేసుకున్నారు కదా. 30 మంది సీఎంలు ఉన్నారు కదా. మీకు పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇది ఓన్లీ విష్‌. క్యాండిడేట్స్‌ ఆల్సో కొందరికి మాటలు కూడా రావు. ఆ సిచ్యువేషన్‌లో క్వొశ్చన్‌లో.. ‘మీకేం పని’ అని అన్నా.ఆర్కే: వాళ్లకి ఇక్కడ సీట్లు ఉన్నాయి. ఆయనకేం పని అన్నారు మీరు.. క్యాజువల్‌గా అన్నారా?

ప్రకాశ్‌రాజ్‌: ఇండిపెండెంట్‌గా నిలుచున్నవారిలా అయిపోయారన్నా. మీ స్థాయికి అలా అవ్వకూడదు అని.ఆర్కే: ‘మా’ సభ్యత్వానికి రిజైన్‌ చేశారు కదా.

ప్రకాశ్‌రాజ్‌: అడిగేది అడుగుతానండీ. ప్రతి నెల ఆదివారం రిపోర్టు కార్డు అడుగుతా. ఐ విల్‌ ఆస్క్‌ ఎ రిపోర్ట్‌. 


ఆర్కే: మెంబర్‌ కాకపోతే ఎలా చేస్తారు.

ప్రకాశ్‌రాజ్‌: నేను ఇక్కడ ఉండి యూపీలో ఆదిత్యనాథ్‌ను ప్రశ్నిస్తా. చైనీస్‌ ప్రెసిడెంట్‌ను అడుగుతా. డొనాల్డ్‌ ట్రంప్‌ను అడుగుతా. నేను మనిషిని. విశ్వమానవుడిని అవుతాన్నేను. అది హ్యూమన్‌ స్పిరిట్‌. స్పందించే గుణం ఉండాలి. మెంబర్‌ అయితేనే స్పందించాలి అంటే ఎలా? అక్కడ ఉండి క్వశ్చన్‌ చేస్తే నన్ను బ్యాన్‌ చేస్తారు. ఇదే కదా మీ అలవాట్లు. ఇంకో 500 మందిని తెస్తారు. బైలాస్‌ మారిపోతుంది మీది. ఆ తర్వాత ఎన్నికలే వద్దంటారు. పర్మినెంట్‌ డీ ఆర్సీ పెట్టుకుంటారు మీరు. గెలిచింది నువ్వు.. మాట్లాడింది మీనాన్న. బెనర్జీని మోహన్‌బాబు కొడుతుంటే ఎలక్షన్‌ ఆఫీసర్‌ మాట్లాడకుండా చూస్తున్నారు. ఇంకో పిల్లవాడిని బూతులు తిడితే ఏమీ అనలేదు. ఎవడైనా ఫ్లయిట్‌ దిగి వస్తే మా పేపర్‌ తీసి వాళ్ల పేపరు చేతికిస్తే మురళీ మోహన్‌గారు చూస్తూ ఉన్నారు. ఇదేనా పెద్దరికం?  


ఆర్కే: కృష్ణమోహన్‌ 10 ఎలక్షన్లు కండక్ట్‌ చేశాడు

ప్రకాశ్‌రాజ్‌: ఇంకేం చేస్తాడు. మోహన్‌బాబు, నరేష్‌కి మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌కు లాయరు. ఏమైనా చేస్తారు.  


ఆర్కే: బెనర్జీని కొట్టారా?

ప్రకాశ్‌రాజ్‌: కొట్టడానికి వెళ్లాడు. బూతులు తిట్టాడు. ఆయన ఏజ్‌ పెద్దది కదా.. పాపం. 


ఆర్కే: మీ ప్యానల్‌ మెంబర్‌ హేమ కొరికిందట కదా..

ప్రకాశ్‌రాజ్‌: దిస్‌ ఈజ్‌ వాట్‌. 


ఆర్కే: మీ స్థాయి ఆర్టిస్టులకు షేమ్‌ అనిపించలేదా..

ప్రకాశ్‌రాజ్‌: అసహ్యంగా ఉంది. అందుకే కదా వచ్చా. నీ రూమ్‌ క్లీన్‌గా ఉంటే సరిపోతుందా? చూస్తున్నవాళ్లకు వీధి కనిపిస్తోంది. ముందు స్లమ్‌ ఉంది కదా. అందరికీ బాధ్యత ఉంది. పెద్దహీరోలు బాధ్యత తీసుకోరు. ఖండించరా? పెద్దలుగా ఉండాలనుకుంటారు. దేన్ని పట్టించుకోకపోతే మంచోళ్లు అంటే ఎలా? ఎవరి బాధ్యత వారికి ఉంది. 


ఆర్కే: మోహన్‌బాబుకి పాదాభివందనం చేశారెందుకు?

ప్రకాశ్‌రాజ్‌: పెద్దోళ్లు.. కూల్‌డౌన్‌ అన్నా. ముఖం మీద చెప్పాను. ఎందుకు రెండేళ్లు తక్కువగా అనిపిస్తున్నది మీకు. అవసరమా ఈ మాటలు అన్నా. ‘సారీ ప్రకాశ్‌.. బిహేవ్‌ యువర్‌ సెల్ఫ్‌ ప్లీజ్‌’ అని చెప్పారు. 


ఆర్కే: ఓ పక్క పాదాభివందనం.. ఇంకో పక్క ఏంటి ఇది?

ప్రకాశ్‌రాజ్‌: ఆయన సీనియర్‌ ఆర్టిస్టు. మోస్ట్‌ హ్యూమరస్‌ ఫెలో. ఆయన్ని డిస్టర్బ్‌ చేయకపోతే.. ఆయనంత మంచోడు లేడు. ఆయనను డిస్టర్బ్‌ చేస్తే పది మంది వెనకాల ఉంటే కొట్టడానికి వస్తాడు. ఆయన ఒక్కడే ఉంటే అలానే ఉంటాడు. ఇలా భయపడితే ఎలా ఉంటుంది అసోసియేషన్‌.


ఆర్కే: మోహన్‌బాబు రెచ్చగొడితే రెచ్చిపోతాడు అన్నారు కదా మీరు. ఇంకో వాదన ఉంది. అతని నోరు అదుపులో ఉండదనేది అందరి మాట.

ప్రకాశ్‌రాజ్‌: ఈ పెద్దవాళ్లతో సమస్య ఏంటంటే.. ‘ఒన్‌వే అది మైవే’ అంటారు. దీనివల్ల హూ ఆర్‌ ది సఫరర్స్‌.


ఆర్కే: ఆయన 15 రోజుల నుంచి నోరు అదుపులో పెట్టుకున్నారు. వారి క్యాంపులోంచి వచ్చిన ప్రొవొకేషన్స్‌తో మీరు నోరు జారారని చెప్పను. టెంపర్‌ లూజ్‌ అయ్యారు. సేమ్‌ టైం నాగబాబు నోరు పారేసుకున్నారు. మీరు కాంటెస్టింగ్‌ క్యాండిడేట్ ఫర్‌ ప్రెసిడెంట్‌ పోస్టు.

ప్రకాశ్‌రాజ్‌: వక్రీకరించి చెప్పినది మీరు చెప్పకూడదు. పెద్దరికం అంటే ఏంటీ అన్నా. ఒక చెట్టు ఉదాహరణ ఇచ్చా. పెద్దోళ్లు పెద్దరికం వద్దంటే భయం వద్దు. వక్రీకరించారు.

ఆర్కే: ఫర్‌ సపోజ్‌ గెలిచినవాడు అర్హత ఉన్నాలేకపోయినా ముఖ్యమంత్రి అవుతున్నాడు కదా..

ప్రకాశ్‌రాజ్‌: అలా అని నేను మారాల్సిన అవసరం లేదనుకున్నా.


ఆర్కే: అలాంటప్పుడు మీరు పర్సనల్‌గా తీసుకున్నారు కదా.. నాన్‌ లోకల్‌, లోకల్‌ అనీ. 

ప్రకాశ్‌రాజ్‌: అది తప్పు కదా? ఆర్కే: వాళ్లంటారు అది ఒక ఆయుధమని..

ప్రకాశ్‌రాజ్‌: ఫైట్‌కు రావద్దని చెప్పలేదు. రాంగ్‌ ఫైట్‌. మనిషి హర్ట్‌ అయ్యారా లేదా! 


ఆర్కే: మీరు హర్ట్‌ అయ్యారా ఇంతకీ..

ప్రకాశ్‌రాజ్‌: ఎందుకు అవ్వను? నేను మాత్రమే కాలేదు కదా. దీని వల్ల చాలా పాపులరయ్యాను. ఎలా రియాక్ట్‌ అయ్యానో చూశారు. వాళ్లు ఏడ్చారు. ఇండిపెండెంట్‌ ఆర్టిస్టుగా ఉండే నన్ను చూసి ఫీలయ్యారు. మా ఆఫీసుముందు ఒకాయన అనవసరంగా రొచ్చులో పడ్డారు కదా అన్నాడు.. ఔను అన్నాను. నా లైఫ్‌లో రొచ్చులో పడాల్సిన అవసరం ఉంది. చరిత్రలో మీరు చేసిన తప్పులను ప్రపంచం మర్చిపోతుందే కానీ మీ మౌనాన్ని క్షమించదు. నేను ఉండలేను సర్‌ అలా. మనసాక్షి ఒప్పుకోదు. 


ఆర్కే: తేడా వచ్చిందంటే మీకు సపోర్టు చేసిన చిరంజీవి, నాగబాబును కడిగేసే రకం. ఈ టెంపర్‌మెంట్‌తో అవకాశాలే రాకపోతే..

ప్రకాశ్‌రాజ్‌: భలేవాళ్లే సర్‌. ఇంతకంటే అవకాశాలు ఇస్తారా? 56 ఏళ్లు నాకు. పొలాలున్నాయి. అన్నీ ఉన్నాయి. ఇన్ని లాంగ్వేజ్‌లు. ఎవరు కాదనేస్తారు సర్‌? భయపెడతారా? మెంబర్స్‌ నుంచి బయటకు వచ్చా. ఆపి చూడండి. 


ఆర్కే: మీరు వర్సటైల్‌ యాక్టర్‌. హీరోల్లో సగం మందికి నటన సరిగా రాదు.. మీకు ఏమనిపిస్తుంది..

ప్రకాశ్‌రాజ్‌: నటన రాకపోవడం వేరు. కొందరికి డ్యాన్స్‌ ఉంటుంది. నేను బెటరా.. వాళ్లు బెటరా అనే డిష్కషన్స్‌కి రాను. నా క్యారెక్టర్‌ స్ర్టాంగ్‌గా ఉందని వాళ్లు ఎడిటింగ్‌లో కట్‌ చేశారు. వాడిని ఎలివేట్‌ చేయటానికి క్యారెక్టర్‌ అలానే చేస్తా. ఐ యామ్‌ ఎన్‌ ఆర్టిస్ట్‌. రియల్‌ లైఫ్‌లో ఎవరినీ డామినేట్‌ చేయలేదు.


ఆర్కే: పరిశ్రమ ఎటు మలుపులు తిరుగుతుందో తెలియడం లేదు కదా!

ప్రకాశ్‌రాజ్‌: ఇప్పుడే మొదలైంది. ఎవడో ఒకడు పుడతాడు. వచ్చాను సర్‌. ఇది మరో చరిత్రనే. 


ఆర్కే: విష్ణు ప్యానల్‌ను జగన్‌ సపోర్టు చేశాడు.. బీజేపీ వాళ్లు కూడా మీకు వ్యతిరేకంగా చేశారు కదా.

ప్రకాశ్‌రాజ్‌: ఆయన ట్వీట్‌ చేశాడు.. ఏమీ లేదు అని. స్టేట్‌కి లీడర్‌ అయిన ఆయన ట్వీట్‌ చేయడమేంటి? ఈ రాజకీయ పార్టీలకు బ్రెయిన్‌ లేదు. అన్నిచోట్ల మనముండాలని అంటారు. అక్కడ కొడతారు. నొప్పి వేస్తుందంటే ఆనందం. నొప్పిలేదంటే సమస్య. ఎంతకొట్టినా నొప్పి లేదంటే.. అని బీజేపీ వాళ్లు టైర్డ్‌ అవుతున్నారు. వీడు అయిపోయింది అనుకుంటే.. ఇలా చేస్తున్నాడే అని అలసిపోతున్నారు. నాకు నచ్చిందీ గేమ్‌. వచ్చి ఏం చేశార్రా ఇక్కడ.. ఓడించగలిగారు. ఆపలేరు కదా నన్ను.


ఆర్కే: మీకు ఆస్తి ఉందా.. మీకు బిజినెస్‌లు లేవు కదా.. ఉంటే భయాన్నిస్తుంది.

ప్రకాశ్‌రాజ్‌: ఎలక్షన్ల సమయంలో నా ఆస్తులు బయటపెట్టా. నాకు ఫామ్‌ హౌస్‌ ఉంది. భూములు ఉన్నాయి. డబ్బు, భూమి కాదు.. నీకు ఎంత కావాలో నీకు తెలియాలి. ఇంక కొనను భూమి. ఎందుకంటే మెయింటేన్‌ చేయడానికి ఇది చాలు. ఫామ్స్‌లో డబ్బులు వస్తున్నాయి. ఇరవై కాటేజెస్‌, రెస్టారెంట్స్‌ రెండున్నాయి. యోగా చేసుకోవచ్చు. తినొచ్చు. ఆఫీషియల్‌. చాలా ప్రశాంతంగా ఉంటుంది. షాద్‌నగర్‌లో ఉంటుంది ఫామ్‌ హౌస్‌. చెట్లను చూడొచ్చు.. ఫ్రూట్స్‌ కోయచ్చు. ఇంట్లో వాళ్లకు కాన్ఫిడెన్స్‌ వచ్చింది. నేను పర్సనల్‌ లైఫ్‌లో రిచ్‌గా ఉంటా. 


ఆర్కే: మీకెంత మంది పిల్లలు?

ప్రకాశ్‌రాజ్‌: ఒక బాబు పోయాడు అప్పుడు.  ముగ్గురు పిల్లలు ఇప్పుడు. పెద్ద కూతురు ఫైన్‌ ఆర్ట్స్‌ పూర్తి చేసింది. తనకిప్పుడు ఇరవై ఐదేళ్లు. రెండో కూతురు ఏ.ఆర్‌.రెహమాన్‌ అకాడమీలో చదువుతోంది. ఆమెకు కంపోజింగ్‌ ఇష్టం. ఇక నా రెండో భార్యకు పుట్టిన బాబుకి ఐదున్నర సంవత్సరాలు.


ఆర్కే: పెద్దమ్మాయికి పెళ్లి చేయాలి...

ప్రకాశ్‌రాజ్‌: అది తన ఇష్టం. ఎవరిని ఎన్నుకున్నా పర్వాలేదు. కార్డు తీసుకుని స్టార్ల ఇళ్లకు తిరగను. నీ పెళ్లి ఖర్చు నీకు ఇచ్చేస్తా అన్నాను. పెళ్లి ఎప్పుడని చెబితే అప్పుడు వస్తా అని చెప్పా. బ్యూటిఫుల్‌ లైఫ్‌.. జీవించు అని చెప్పా. అన్నీ నేను చేయలేనన్నా. ఫెంటాస్టిక్‌ డాడ్‌ అంది.


ఆర్కే: అన్ని భాషల్లో చేశారు కదా.. ఇక్కడలా రాజకీయాలున్నాయా.. అక్కడ విశాల్‌ నాన్‌లోకల్‌ కాలేదా.. మిమ్మల్నే ఎందుకంటారు?

ప్రకాశ్‌రాజ్‌: అక్కడ ఆ ఇష్యూ వచ్చింది. నన్నే అన్నారు. ఆల్వేస్‌ నేను ఔట్‌ సైడర్‌. పుట్టుకతోనే నాన్‌లోకల్‌ నేను. మా అమ్మ క్రిస్టియన్‌. మా నాన్న హిందూ. నేను హిందూ అయ్యా. మా నాన్న ఫ్యామిలీకి నేను నాన్‌‌లోకల్‌. ఆ తర్వాత కర్ణాటకలో పెద్ద స్టార్లు ఉన్న ఇండస్ర్టీ. అక్కడికి ఓ నర్సు కొడుకు రావడం అప్పుడు కూడా నాన్‌లోకల్‌. ఫ్యామిలీ ఇండస్ర్టీనే అది. 25 ఏళ్లు ఇక్కడే ఉండి అదే నినాదం వింటే బాధ కదా.


ఆర్కే: ఏడ్చారా..

ప్రకాశ్‌రాజ్‌: ఎందుకు ఏడ్వను. ఇంటికెళ్లి పడుకున్నపుడు ఉంటుంది కదా. ఇది పర్సనల్‌గా తీసుకున్నా. బాధ ఉంటుంది. నేను రాయి కాదు కదా. మనసు ఉంటుంది. భార్యకి భయముంటుంది. నేను ఒక్కడినే అంటే అది వేరు. దేనికీ సంబంధంలేని వాళ్లమీద ఎఫెక్టు ఉంటుంది కదా. ప్రశాంతంగా ఉండే వాడిని ఇంట్లో వాళ్లను హర్ట్‌ చేస్తున్నానా అనిపించింది. 


ఆర్కే: మీరు దేవుడిని నమ్మరా..

ప్రకాశ్‌రాజ్‌: నేను దేవుడిని నమ్మను. నా సమస్య ఏంటంటే దేవుడు ఉన్నాడనడానికి నమ్మితే చాలు. లేడు అనడానికి చాలా జ్ఞానం కావాలి. దానికి  టైమ్‌ లేదు. హోమం చేస్తే ఇంట్లో కూర్చుంటా. నా కొడుకు చర్చికి వెళ్దామంటే తీసుకెళ్తా. 


ఆర్కే: అహంకారం, యారగెంట్‌ అని టైటిల్స్‌ ఇచ్చారు. మరి రివేంజ్‌ ఎలా..?

ప్రకాశ్‌రాజ్‌: అదేం లేదు. గెలిచి ఉంటే వేరే రకంగా ఉండేది. కొందరితో అసోసియేషన్‌లో మాట్లాడేవాడిని. ఇప్పుడు లేను కాబట్టి సగమే చేయగలను. నన్ను నమ్మారు. మై లీడర్‌ ఈజ్‌ నాట్‌ దేర్‌ అంటుంటే బాధేస్తుంది. వాళ్లను నమ్మించాను కాబట్టి బాధ్యతగా ఉండాలి. 


ఆర్కే: ఒక్కొక్కరు 30 కోట్లు తీసుకుంటారు. ఓ ఏడాది ఆర్టిస్టులంతా 5శాతం పెడితే.. ‘మా’ బిల్డింగ్‌ పూర్తి కాదా?

ప్రకాశ్‌రాజ్‌: అది భిక్ష అవుతుంది. ఉదాహరణకి తమిళనాడులో పెప్పీ వర్కర్స్‌కి కరోనా వచ్చింది. మణిరత్నంతో నవరస అనే తొమ్మిది సినిమాలు చేశాం. నేను, సూర్య.. అందరం ఉచితంగా చేస్తే 15 కోట్లు వచ్చింది. ఫండ్‌రైజింగ్‌తో చాలా పనులు చేశాం.  


ఆర్కే: మా రిపేర్‌ అయితే మెంబర్‌ అవుతారా..

ప్రకాశ్‌రాజ్‌: విష్ణు నా రిజైన్‌ను ఒప్పుకోలేదు కదా. బాగచేస్తే మంచిదే. నేను గెలిపించడానికి పనికొస్తాను.. గెలవడానికి కాదా? నేను ఓటరును కాను. గుద్దించుకోలేదు. అందుకే బయటికొచ్చా. నాన్‌లోకల్‌ అనే పదం వాళ్లు తీసేయాలి. అప్పుడే జాయిన్‌ అవుతా.


ఆర్కే: ఈ బాధ నుంచి బయటపడి ‘మా’ని సంస్కరించే దిశగా అడుగులు వేయాలని కోరుకుంటూ థ్యాంక్యూ వెరీ మచ్‌.


Updated Date - 2021-10-18T13:50:03+05:30 IST