‘మాచర్ల నియోజకవర్గం’లో మరో హీరోయిన్ ఫిక్సయింది
ABN , First Publish Date - 2021-11-16T22:11:24+05:30 IST
నితిన్ హీరోగా రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణలో.. ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్స్‌పై ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఈ సినిమా ప్రకటన

నితిన్ హీరోగా రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణలో.. ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్స్‌పై ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుండి సినిమాపై మంచి అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇందులో నితిన్ సరసన కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ఈ చిత్రంలో ఉందని తెలుపుతూ.. ఆ హీరోయిన్ వివరాలను చిత్రయూనిట్ ప్రకటించింది.
‘మాచర్ల నియోజకవర్గం’లో మరో హీరోయిన్‌గా కేథరిన్ థ్రెసాను ఫిక్స్ చేసినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న చిత్ర షూటింగ్‌లో కేథరిన్ జాయిన్ కానుందని తెలుపుతూ.. ఆమె లుక్‌కి సంబంధించిన పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. కేథరిన్ థ్రెసా, నితిన్ కలిసి నటిస్తున్న మొదటి చిత్రం ఇదే. కాగా, నితిన్ ‘భీష్మ’, ‘మాస్ట్రో’ చిత్రాలకు సంగీతం అందించిన మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. చిత్రాన్ని ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.