ఒకటి విడుదల కాకుండానే మరొకటి!
ABN , First Publish Date - 2021-12-28T05:49:03+05:30 IST
ఓ సినిమా విడుదల కాకుండానే ఆ చిత్రానికి పనిచేసిన యూనిట్‌తోనే మరో సినిమా అనౌన్స్ చేయడం నిజంగా విశేషమే. ఈ మధ్య కాలంలో ఎరుగని సంఘటన కూడా...

ఓ సినిమా విడుదల కాకుండానే ఆ చిత్రానికి పనిచేసిన యూనిట్‌తోనే మరో సినిమా అనౌన్స్ చేయడం నిజంగా విశేషమే. ఈ మధ్య కాలంలో ఎరుగని సంఘటన కూడా. ఆది సాయికుమార్ నటించిన ‘తీస్ మార్ ఖాన్’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. విజన్ సినిమాస్ బేనర్‌పై ఆ చిత్రాన్ని నిర్మిస్తున్న నాగం తిరుపతిరెడ్డి అదే యూనిట్‌తో మరో సినిమా నిర్మించనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ చిత్రంలో కూడా ఆది సాయికుమార్ హీరోగా నటించనున్నారు. కల్యాణ్ జి. గోగణ దర్శకత్వం వహిస్తారు. ఈ సందర్భంగా నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ‘ రషెస్ చూశాక ‘తీస్ మార్ ఖాన్’ సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం కలిగింది. త్వరలోనే ఆ చిత్రాన్ని విడుదల చేస్తాం. నా తదుపరి చిత్రంలో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తారు. కల్యాణ్ జి.గోగణ దర్శకత్వం వహిస్తారు. ఇకపై ఆది సాయికుమార్‌తో ప్రతి ఏడాది ఓ సినిమా చేయాలనుకుంటున్నాను’ అని తెలిపారు.
‘తీస్ మార్ ఖాన్’ చిత్రాన్ని చాలా ఎంజాయ్ చేస్తూ పూర్తి చేశామనీ, దర్శకనిర్మాతలు ఔట్‌పుట్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా ముందుకెళ్లారనీ ఆది సాయికుమార్ చెప్పారు. ‘ఈ సినిమాలో మంచి పాత్ర చేశాను. ఆది సాయికుమార్ చాలా కష్టపడ్డారు. త్రీ షేడ్స్‌లో ఆయన నటనలోని ఎలివేషన్స్ బయటపడతాయి’ అన్నారు సునీల్.