సూపర్ స్టార్‌తో మరోసారి..

ABN , First Publish Date - 2021-06-13T15:00:53+05:30 IST

సూపర్ స్టార్ మహేష్ బాబుతో మరోసారి నటించాలని ఉందంటూ తన మనసులోని కోరికను బయటపెట్టింది కృతి సనన్. తెలుగు సినిమా '1 నేనొక్కడినే'తో ఈమె కెరీర్ ప్రారంభించింది. కానీ తెలుగులో కంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులారిటీ సంపాదించుకుంది. అక్కడ వరుస హిట్ అందుకొని మోస్ట్ బిజీయస్ట్ హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఏడు సినిమాలు ఉన్నాయి.

సూపర్ స్టార్‌తో మరోసారి..

సూపర్ స్టార్ మహేష్ బాబుతో మరోసారి నటించాలని ఉందంటూ తన మనసులోని కోరికను బయటపెట్టింది కృతి సనన్. తెలుగు సినిమా '1  నేనొక్కడినే'తో ఈమె కెరీర్ ప్రారంభించింది. కానీ తెలుగులో కంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులారిటీ సంపాదించుకుంది. అక్కడ వరుస హిట్ అందుకొని మోస్ట్ బిజీయస్ట్ హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఏడు సినిమాలు ఉన్నాయి. వీటిలో ప్రభాస్ నటిస్తున్న పౌరాణిక చిత్రం 'ఆదిపురుష్' కూడా ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేసిన కృతి.. ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. "కెరీర్‌లో ఎంతో స్పెషల్ అండ్ మోస్ట్ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్. ఈ సినిమాలో ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తున్నాను" అన్నారు. అలాగే సూపర్ మహేష్ బాబు గురించి ఒకే మాటలో చెప్పాలంటే.. 'బెస్ట్.. మై ఫస్ట్ ఎవర్ కో-స్టార్.. హంబల్ అమేజింగ్.. ఆయనతో మరోసారి వర్క్ చేయాలనీ ఉందీ..అంటూ తన మనసులో కోరిక బయటపెట్టింది. 

Updated Date - 2021-06-13T15:00:53+05:30 IST