శిల్పారామంలో ఆర్‌ఆర్‌ఆర్‌ భామ

ABN , First Publish Date - 2021-08-29T05:43:01+05:30 IST

‘ఆర్‌ఆర్‌ఆర్‌: రౌద్రం రణం రుధిరం’తో భారతీయ తెరకు పరిచయమవుతున్న విదేశీ భామ ఒలీవియా మోరిస్‌. కొమరం భీమ్‌ పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్‌కు జంటగా ఆమె...

శిల్పారామంలో ఆర్‌ఆర్‌ఆర్‌ భామ

‘ఆర్‌ఆర్‌ఆర్‌: రౌద్రం రణం రుధిరం’తో భారతీయ తెరకు పరిచయమవుతున్న విదేశీ భామ ఒలీవియా మోరిస్‌. కొమరం భీమ్‌ పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్‌కు జంటగా ఆమె కనిపించనున్న సంగతి తెలిసిందే. సినిమా చిత్రీకరణ పూర్తి కావడంతో భాగ్యనగరంలోని శిల్పారామాన్ని ఒలీవియా సందర్శించారు. ఛాట్‌, దహి పూరి తిన్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు స్టయిలిస్ట్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేసిన అనురెడ్డి ఆమెకు తోడుగా ఉన్నారు. ఆ  ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఓలీవియా మోరిస్‌, ‘‘హైదరాబాద్‌లో మంచి వర్షం పడిన వేళలో...’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2021-08-29T05:43:01+05:30 IST