ఓ రేంజ్ ప్రొడక్షన్స్‌లో ‘బ్రహ్మ రాసిన కథ’

ABN , First Publish Date - 2021-11-16T01:33:09+05:30 IST

ఓ రేంజ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై లారెన్స్ నరేష్, శ్రీలయ హీరోహీరోయిన్లుగా నవీన్ సంకు దర్శకత్వంలో లేడీ నిర్మాత సింధు నాయుడు నిర్మిస్తున్న చిత్రం ‘బ్రహ్మ రాసిన కథ’. ఇండిపెండెంట్ చిత్రంగా రూపొందిన ఈ చిత్రంతోనే సింధు నాయుడు

ఓ రేంజ్ ప్రొడక్షన్స్‌లో ‘బ్రహ్మ రాసిన కథ’

ఓ రేంజ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై లారెన్స్ నరేష్, శ్రీలయ హీరోహీరోయిన్లుగా నవీన్ సంకు దర్శకత్వంలో లేడీ నిర్మాత సింధు నాయుడు నిర్మిస్తున్న చిత్రం ‘బ్రహ్మ రాసిన కథ’. ఇండిపెండెంట్ చిత్రంగా రూపొందిన ఈ చిత్రంతోనే సింధు నాయుడు నిర్మాతగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం ప్రేమలోని ఓ సరికొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుందని ఆమె తెలిపారు. 


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘సాక్షాత్తూ సరస్వతీదేవి సిఫార్సుతో బ్రహ్మదేవుడి నుంచి ఓ వినూత్నమైన వరం పొందిన ఓ యువకుడి ప్రేమకథలో చోటుచేసుకునే చిత్రవిచిత్రమైన ట్విస్టుల సమాహారంగా ‘బ్రహ్మ రాసిన కథ’ చిత్రాన్ని తెరకెక్కించాం. మా దర్శకుడు నవీన్ సంకు చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. దర్శకుడిగా అతనికి ఉజ్వల భవిష్యత్ ఉంటుంది.. అలాగే హీరోహీరోయిన్లకు కూడా చాలా మంచి పేరు తెచ్చిపెట్టే చిత్రమిది. వారిద్దరూ పోటాపోటీగా నటించారు. మంచి టీమ్ కుదిరింది. చిత్రాన్ని సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తాము..’’ అని తెలిపారు.

Updated Date - 2021-11-16T01:33:09+05:30 IST