ఓ నా దేవేరి...

ABN , First Publish Date - 2021-12-29T05:43:04+05:30 IST

నూజివీడు టాకీస్‌ సంస్థ నిర్మిస్తున్న ‘ఐరావతం’ చిత్రంలోని ‘ఓ నా దేవేరి’ లిరికల్‌ వీడియోను బిగ్‌బాస్‌ 5 టీమ్‌ సభ్యులైన నటరాజ్‌ మాస్టర్‌, లోబో, మానస్‌, కాజల్‌, ప్రణీత్‌ విడుదల చేశారు...

ఓ నా దేవేరి...

నూజివీడు టాకీస్‌ సంస్థ నిర్మిస్తున్న ‘ఐరావతం’ చిత్రంలోని ‘ఓ నా దేవేరి’ లిరికల్‌ వీడియోను బిగ్‌బాస్‌ 5 టీమ్‌ సభ్యులైన నటరాజ్‌ మాస్టర్‌, లోబో, మానస్‌, కాజల్‌, ప్రణీత్‌ విడుదల చేశారు. రామ్‌ మిర్యాల పాడిన ఈ పాటకు మంచి స్పందన వచ్చినట్లు నిర్మాతలు రాంకీ సల్లగాని, లలితకుమారి, తోట బాలయ్య చౌదరి చల్లా చెప్పారు.అమర్‌దీప్‌, తన్వీ ఇందులో హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. చిత్ర దర్శకుడు సుహాస్‌ మీరా మాట్లాడుతూ ‘వైట్‌ కలర్‌లో ఉన్న కెమెరాను క్లిక్‌ చేస్తే ఓ మ్యాజిక్‌ జరుగుతుంది. ఆ కెమెరా హీరోయిన్‌ చేతుల్లోకి వచ్చాక ఆమె పడిన ఇబ్బందులు ఏమిటనేవి ఆసక్తికరంగా ఉంటాయి’ అని తెలిపారు. ఓ యూనిక్‌ స్టోరీకి సంగీతం ఇవ్వడం తన అదృష్టం అని సంగీత దర్శకుడు సత్య అన్నారు.


Updated Date - 2021-12-29T05:43:04+05:30 IST