ఆకట్టుకుంటున్న `నువ్వుంటే నా జతగా..` ట్రైలర్!
ABN , First Publish Date - 2021-01-28T20:12:41+05:30 IST
శ్రీకాంత్ బిరోజు, గీతికా రతన్ జంటగా దర్శకుడు సంజయ్ కర్లపూడి రూపొందించిన చిత్రం `నువ్వుంటే నా జతగా`.

శ్రీకాంత్ బిరోజు, గీతికా రతన్ జంటగా దర్శకుడు సంజయ్ కర్లపూడి రూపొందించిన చిత్రం `నువ్వుంటే నా జతగా`. సుమ కర్లపూడి, రామకృష్ణ బలుసు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ బయటకు వచ్చింది. ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉంది.
రామ్, భూమి ప్రేమించి పెళ్లి చేసుకున్నాక ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు, ఆ పరిస్థితుల కారణంగా ఎలాంటి వేదనను అనుభవించారనేది ఈ చిత్రం కథాంశంగా ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. ఈ సినిమాకు జ్ఞాని సంగీతం సమకూర్చగా, సుకుమార్ అల్లు సినిమాటోగ్రఫీని అందించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.