త్వరలో ఎన్టీఆర్30 చిత్రీకరణ..
ABN, First Publish Date - 2021-01-03T05:25:14+05:30
ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో రూపొందనున్న రెండో సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుందా? అంటే ‘అవును’ అనే చెప్పాలి. ‘‘ఎన్టీఆర్30 చిత్రీకరణ అతి త్వరలో మొదలువుతుంది’’ అని హారిక అండ్ హాసిని క్రియేషన్స్....
ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో రూపొందనున్న రెండో సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుందా? అంటే ‘అవును’ అనే చెప్పాలి. ‘‘ఎన్టీఆర్30 చిత్రీకరణ అతి త్వరలో మొదలువుతుంది’’ అని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ట్వీట్ చేసింది. దీనికి నూతన సంవత్సరం సందర్భంగా మంగళవారం హీరో, దర్శకుడు ఆత్మీయపూర్వకంగా కలిసిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ‘అరవింద సమేత వీరరాఘవ’ తర్వాత ఎన్టీఆర్, తివిక్రమ్ చేస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు), నందమూరి కల్యాణ్‌రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.