NTR: ఆర్.ఆర్.ఆర్ కొత్త పోస్టర్‌లో తారక్ లుక్ వైరల్..
ABN , First Publish Date - 2021-12-29T15:14:23+05:30 IST
తాజాగా 'ఆర్ఆర్ఆర్' చిత్రం నుంచి రిలీజైన ఎన్టీఆర్ కొత్త పోస్టర్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు బాగా వైరల్ అవుతోంది. దర్శక ధీరుడు రాజామౌళి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియన్ సినిమా 'ఆర్ఆర్ఆర్'లో

తాజాగా 'ఆర్ఆర్ఆర్' చిత్రం నుంచి రిలీజైన ఎన్టీఆర్ కొత్త పోస్టర్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు బాగా వైరల్ అవుతోంది. దర్శక ధీరుడు రాజామౌళి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియన్ సినిమా 'ఆర్ఆర్ఆర్'లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన విషయం తెలిసిందే. అతి త్వరలో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో సౌత్ అండ్ నార్త్‌లో రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈ చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. కాగా, ఇప్పుడు గోండు బెబ్బులి కొమురమ్ భీమ్ పాత్రలో నటించిన తారక్ కొత్త పోస్టర్ విడుదలైంది. ఇందులో తారక్ కాస్ట్యూమ్ గురించే ప్రతీ ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. పంచె కట్టు.. షర్ట్ మీదుగా లెదర్ బ్యాగ్.. దానికి పులి గోళ్లు.. చేతికి లెదర్‌ను చుట్టుకుని అద్భుతంగా కనిపిస్తున్నారు. ఆ స్టైల్ చూస్తేనే మరో లెవల్ అనేట్టుగా ఉన్న తారక్ కొత్త పోస్టర్‌కు అభిమానులు మాత్రమే కాదు ప్రేక్షకులు ఫ్లాటవుతున్నారు. కాగా, 'ఆర్ఆర్ఆర్' జనవరి 7న 14 భాషలలో రాబోతుంది. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
