‘101 జిల్లాల అందగాడు’ ఫస్ట్ లుక్.. అంతా డ్రామా!
ABN, First Publish Date - 2021-03-26T01:44:35+05:30
రెండు రోజుల క్రితం అవసరాల శ్రీనివాస్ నిజ స్వరూపం ఇదంటూ ఓ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే అంతా నిజంగానే అవసరాల అలాంటి వాడా అని
రెండు రోజుల క్రితం అవసరాల శ్రీనివాస్ నిజ స్వరూపం ఇదంటూ ఓ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే అంతా నిజంగానే అవసరాల అలాంటి వాడా అని అనుకున్నారు. కానీ ఇదంతా డ్రామా అని.. చిత్ర ప్రమోషన్ కోసం వేసిన ప్లాన్ అనేది.. తాజాగా విడుదలైన ‘101 జిల్లాల అందగాడు’ ఫస్ట్ లుక్ చూస్తేనే అర్థమవుతుంది. డిఫరెంట్ సినిమాలకు ఈ మధ్య తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో కొత్త తరం దర్శకులు వైవిధ్యమైన చిత్రాలు, పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడానికి హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, దర్శక నిర్మాత క్రిష్ జాగర్లమూడి కలిసి డిఫరెంట్ సినిమాను రూపొందిస్తున్నారు. నటుడిగా, దర్శకుడిగా తన ప్రత్యేకతను చాటుకుంటోన్న అవసరాల శ్రీనివాస్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఎంటర్‌టైనర్ ‘101 జిల్లాల అందగాడు’. రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై దిల్‌రాజు, డైరెక్టర్ క్రిష్ సమర్పణలో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. గురువారం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఫస్ట్‌లుక్ చూడగానే.. రీసెంట్‌గా వైరల్ అయిన వీడియో.. అంతా డ్రామా అని, చిత్రయూనిట్ కావాలని ప్రమోషన్ కోసం చేసిన ప్లాన్‌గా అంతా ఓ లెక్కకి వచ్చేశారు. ఈ ఫస్ట్ లుక్‌లో సేమ్ టు సేమ్ ఆ వీడియోలో కనిపించిన అవసరాలే కనిపించారు. అవసరాల శ్రీనివాస్ బట్టతలతో ఈ ఫస్ట్ లుక్‌లో దర్శనమివ్వడంతో.. మ్యాటర్ మొత్తం జనాలకి అర్థమైపోయింది. తెలుగు సినిమాల్లో హీరోకు బట్టతల ఉండటమనేది ఇప్పటి వరకు రానటువంటి కథాంశం. ఇలాంటి కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ‘101 జిల్లాల అందగాడు’ చిత్రంలో అవసరాల శ్రీనివాస్ గొత్తి సూర్య నారాయణ అనే పాత్రలో నటిస్తున్నారు. రుహనీ శర్మ హీరోయిన్. టాలీవుడ్‌లో డిఫరెంట్ మూవీస్‌లో నటుడిగా, సెన్సిబుల్ డైరెక్టర్‌గా, రైటర్‌గా తనదైన గుర్తింపు సంపాదించుకున్న అవసరాల శ్రీనివాస్ ‘101 జిల్లాల అందగాడు’ చిత్రంలో హీరోగా నటించడమే కాకుండా కథను కూడా అందించడం విశేషం. కామెడీ పంచులతో ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా మంచి ఎంటర్‌టైనింగ్ స్టోరీని ఆయన రెడీ చేసినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని మే 7న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.