సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

నో గన్‌.. నో ఎంట్రీ

ABN, First Publish Date - 2021-12-16T05:54:02+05:30

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రానికి ‘హ్యాపీ బర్త్‌డే’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘మత్తు వదలరా’ చిత్రానికి దర్శకత్వం వహించిన రితేష్‌ రానా ఈ చిత్రానికి దర్శకుడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లావణ్య త్రిపాఠి  ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రానికి ‘హ్యాపీ బర్త్‌డే’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘మత్తు వదలరా’ చిత్రానికి దర్శకత్వం వహించిన రితేష్‌ రానా ఈ చిత్రానికి దర్శకుడు. క్లాప్‌   ఎంటర్‌టైన్‌మెంట్స్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. లావణ్య త్రిపాఠి పుట్టినరోజు సందర్బంగా టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ని చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఫస్ట్‌లుక్‌లో లావణ్య మిషన్‌ గన్‌ పట్టుకుని ఫైరింగ్‌ చేస్తున్నారు. చిత్ర టైటిల్‌ చుట్టూ గన్స్‌ చూపిస్తూపక్కనే ‘నో గన్‌.. నో ఎంట్రీ’ అని ఉన్న క్యాప్షన్‌ చూస్తే ఇది ఏ తరహా చిత్రమో ఇట్టే అర్థమవుతుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘ఇటీవల రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెట్టాం.హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు రితేష్‌ రానా తీర్చిదిద్దుతున్నారు. టెక్నికల్‌గా సినిమా హై స్టాండర్డ్స్‌ లో ఉంటుంది’ అని తెలిపారు. నరేశ్‌ అగస్త్య, వెన్నెల కిశోర్‌, సత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, సినిమాటోగ్రఫీ: సురేశ్‌ సారంగం, లైన్‌ ప్రొడ్యూసర్‌: అలేఖ్య పెదమల్లు, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: బాబా సాయికుమార్‌, నిర్మాతలు: చిరంజీవి(చెర్రీ), హేమలత పెదమల్లు.


Updated Date - 2021-12-16T05:54:02+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!