అనుమానాలొద్దు.. ‘ఈశ్వరన్‌’ సంక్రాంతికే

ABN , First Publish Date - 2021-01-11T00:16:09+05:30 IST

శింబు - నిధి అగర్వాల్ జంటగా నటించిన ‘ఈశ్వరన్‌’ చిత్రం ఈనెల 13వ తేదీ నుంచి థియేటర్లలో వందశాతం ప్రేక్షకులతో సినిమాలు ప్రదర్శించుకోవచ్చంటూ ప్రభుత్వం

అనుమానాలొద్దు.. ‘ఈశ్వరన్‌’ సంక్రాంతికే

శింబు - నిధి అగర్వాల్ జంటగా నటించిన ‘ఈశ్వరన్‌’ చిత్రం ఈనెల 13వ తేదీ నుంచి థియేటర్లలో వందశాతం ప్రేక్షకులతో సినిమాలు ప్రదర్శించుకోవచ్చంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఉపసంహరించుకున్న నేపథ్యంలోనూ.. ఈనెల 14నే విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాతలు స్పష్టం చేశారు. ప్రభుత్వం జారీచేసిన జీవోను ఉపసంహరించుకోవడంతో శింబు హీరోగా నటించిన ‘ఈశ్వరన్‌’ చిత్రం విడుదలపై సందేహాలు నెలకొన్నాయి. ఈనెల 13న విజయ్‌ నటించిన ‘మాస్టర్‌’ చిత్రం వెయ్యికిపైగా థియేటర్లలో విడుదలవుతోంది. ఆ మరుసటి రోజున విడుదలయ్యే ‘ఈశ్వరన్‌’ చిత్రానికి థియేటర్ల కొరత ఏర్పడవచ్చని, దీంతో చిత్రం విడుదల వాయిదా పడొచ్చని టాక్‌ వినిపించింది. ఈ ఊహాగానాలకు ‘ఈశ్వరన్‌’ నిర్మాణ సంస్థ తెరదించింది. శుక్రవారం ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ ట్రైలర్‌కు శింబు ఫ్యాన్స్‌ నుంచి మంచి స్పందన వస్తోంది. అదేసమయంలో హీరో ధనుష్‌ను టార్గెట్‌ చేస్తూ కొన్ని డైలాగులు ఈ చిత్రంలో ఉన్నాయనేలా విమర్శలు వస్తున్నాయి. మరి విడుదల తర్వాత ఈ చిత్రం ఎటువంటి కాంట్రవర్సీకి చోటిస్తుందో చూద్దాం.

Updated Date - 2021-01-11T00:16:09+05:30 IST