నీవల్లేరా... రాజా!
ABN , First Publish Date - 2021-11-09T06:58:18+05:30 IST
రాజ్ తరుణ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అనుభవించు రాజా’. కాశిష్ ఖాన్ కథానాయిక. శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహించారు...

రాజ్ తరుణ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అనుభవించు రాజా’. కాశిష్ ఖాన్ కథానాయిక. శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహించారు. సుప్రియ నిర్మాత. ఈ చిత్రంలోని ‘నీ వల్లేరా..’ అనే గీతాన్ని ప్రముఖ కథానాయిక పూజా హెగ్డే విడుదల చేశారు. భాస్కరభట్ల రవికుమార్ రాసిన ఈ పాటకు గోపీ సుందర్ స్వరాలు అందించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఇదో జల్సా రాయుడి కథ. భీమవరంలో అల్లరి చిల్లరగా తిరిగే అబ్బాయి చుట్టూ వినోదాత్మకంగా సాగుతుంది. ఇప్పటికే టీజర్‌ని విడుదల చేశాం. ఓ పాట కూడా వినిపించాం. వాటికి మంచి స్పందన వచ్చింది. ఈనెల 26న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామ’’న్నారు.