సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

నితిన్ ‘మాస్ట్రో’ షూటింగ్‌ పూర్తి

ABN, First Publish Date - 2021-06-20T19:21:09+05:30

నితిన్ క‌థానాయ‌కుడిగా రూపొందుతోన్న చిత్రం ‘మాస్ట్రో’. నితిన్‌ 30వ మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నితిన్ క‌థానాయ‌కుడిగా రూపొందుతోన్న చిత్రం ‘మాస్ట్రో’. నితిన్‌ 30వ మూవీగా  తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి  మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రైమ్‌ కామెడీ చిత్రంలో  నితిన్‌ సరసన నభా నటేష్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా హీరోయిన్ తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది.‘మాస్ట్రో’ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ మూవీ ఫైన‌ల్ షెడ్యూల్ ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో మొద‌లైన సంగ‌తి తెలిసిందే.  హీరో నితిన్, తమన్నాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు దర్శకుడు మేర్లపాక గాంధీ. సినిమాలో వచ్చే అత్యంత కీలకమైన సన్నివేశాలు ఇవి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత షూటింగ్‌లో స్టార్ చేసిన మూవీ ‘మాస్ట్రో’ కావడం విశేషం.  శ్రేష్ఠ్ మూవీస్‌ పతాకంపై రాజ్‌ కుమార్‌ ఆకేళ్ళ సమర్పణలో ఎన్‌.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నఈ సినిమాకు జె యువరాజ్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. 

Updated Date - 2021-06-20T19:21:09+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!