ప్రేమ‌తో హిట్ ఇవ్వండి: నితిన్‌

ABN , First Publish Date - 2021-03-20T16:37:09+05:30 IST

నితిన్‌, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన చిత్రం రంగ్ దే. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం క‌ర్నూలులో రిలీజ్ చేశారు.

ప్రేమ‌తో హిట్ ఇవ్వండి:  నితిన్‌

నితిన్‌, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన చిత్రం రంగ్ దే. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. మార్చి 26న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం క‌ర్నూలులో రిలీజ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి క‌ర్నూలు ఎమ్మెల్యే హ‌ఫీజ్ ఖాన్‌, కోడుమూరు ఎమ్మెల్యే సుధాక‌ర్,  క‌ర్నూలు మునిసిప‌ల్ క‌మిష‌నర్ బాలాజీ,  క‌ర్నూలు ట్రాఫిక్ డీఎస్పీ మెహ‌బూబ్ బాషా త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. డీజీ భ‌ర‌త్‌, ఎమ్మెల్యేలు హ‌ఫీజ్ ఖాన్‌, సుధాక‌ర్ క‌లిసి రంగ్ దే ట్రైల‌ర్‌ను ఆవిష్క‌రించారు.


నితిన్ మాట్లాడుతూ  "క‌ర్నూలు రావ‌డం నాకిదే ఫ‌స్ట్ టైమ్‌. క‌ర్నూలు అంటే నాకు గుర్తొచ్చేది కొండారెడ్డి బురుజు. అక్క‌డ తీసిన సినిమాలు హిట్ట‌య్యాయి. రంగ్ దే సినిమా విష‌యానికి వ‌స్తే మా  సినిమా మార్చి 26న విడుద‌ల‌వుతుంది. ప్యూర్ ల‌వ్ స్టోరీ. మామూలుగా రాయ‌ల‌సీమ అంటే ఉట్టి మాస్‌, ఫ్యాక్ష‌న్ అంటారు. కానీ ఆ రెండింటి కంటే కూడా మీలో ల‌వ్ ఎక్కువ ఉంది. అందుకే ఫ‌స్ట్ ఈ ఈవెంట్‌ను ఇక్క‌డ పెట్టాం. ఇదే ప్రేమ‌తో సినిమా చూసి, మాకు హిట్టివ్వండి" అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు 'రంగ్ దే' సినిమా పెద్ద హిట్ కావాలని ఆకాంక్షించారు. 



Updated Date - 2021-03-20T16:37:09+05:30 IST