హీరో నిఖిల్‌ని సన్మానించిన సీపీ సజ్జనార్
ABN , First Publish Date - 2021-08-14T04:00:46+05:30 IST
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్‌ని సీపీ సజ్జనార్ సత్కరించారు. కోవిడ్ సెకండ్ వేవ్ టైమ్‌లో నిఖిల్ చేసిన సేవను గుర్తించిన సీపీ సజ్జనార్.. నిఖిల్‌ని శాలువాతో సత్కరించి
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్‌ని సీపీ సజ్జనార్ సత్కరించారు. కోవిడ్ సెకండ్ వేవ్ టైమ్‌లో నిఖిల్ చేసిన సేవను గుర్తించిన సీపీ సజ్జనార్.. నిఖిల్‌ని శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ విషయాన్ని నిఖిల్ తన ట్విట్టర్ ద్వారా తెలుపుతూ.. సజ్జనార్ సత్కరిస్తున్న వీడియోని షేర్ చేశారు. ‘‘కోవిడ్ సెకండ్ వేవ్ టైమ్‌లో చేసిన పనిని గుర్తించి సీపీ సజ్జనార్‌గారు ఇలా సత్కరించడాన్ని గౌరవంగా భావిస్తున్నాను..’’ అని నిఖిల్ ట్వీట్ చేశారు. ఇక ఆయన హీరోగా నటిస్తోన్న ‘18 పేజెస్’ చిత్రం ఒకవైపు షూటింగ్ జరుపుకుంటూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రం కోసం నిఖిల్ ప్రస్తుతం డబ్బింగ్ చెబుతున్నారు.