Nidhi agarwal: నాకిష్టమైన సాంగ్ పవన్ కళ్యాణ్‌దే..

ABN , First Publish Date - 2021-12-30T14:01:10+05:30 IST

నాకిష్టమైన సాంగ్ పవన్ కళ్యాణ్‌దే..అని చెప్పింది ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్. బాలీవుడ్ సినిమాతో హీరోయిన్‌గా మారి..తెలుగు సినిమాలతో బిజీ అయిన యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్. అక్కినేని నాగ చైతన్య హీరోగా వచ్చిన 'సవ్యసాచి'

Nidhi agarwal: నాకిష్టమైన సాంగ్ పవన్ కళ్యాణ్‌దే..

నాకిష్టమైన సాంగ్ పవన్ కళ్యాణ్‌దే..అని చెప్పింది ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్. బాలీవుడ్ సినిమాతో హీరోయిన్‌గా మారి..తెలుగు సినిమాలతో బిజీ అయిన యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్. అక్కినేని నాగ చైతన్య హీరోగా వచ్చిన 'సవ్యసాచి' సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి..ఆ తర్వాత అక్కినేని అఖిల్ సరసన 'మిస్టర్ మజ్ఞు' సినిమాలో హీరోయిన్‌గా అవకాశం అందుకుంది. ఈ రెండు చిత్రాలతో నిధికి మంచి గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలో ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని - పూరి కాంబోలో వచ్చి బ్లాక్ బస్టర్ సాధించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో ఓ హీరోయిన్‌గా నిధి నటించింది. ఈ సినిమాతో ఇస్మార్ట్ బ్యూటీగా టాలీవుడ్ ప్రేక్షకులను, మేకర్స్‌ను బాగా ఆకట్టుకుంది. దీంతో తమిళ ఇండస్ట్రీ నుంచి వరుసగా రెండు సినిమాలలో నటించే అవకాశాలు అందుకుంది. ఇదే క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా 'హరిహర వీరమల్లు' సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకుంది. 


కాగా, నిధి ఇటీవల ఓ చిట్ చాట్‌లో.. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చింది. అంతేకాదు, మీ ఫేవరేట్ సాంగ్ ఏది..? అని అడిగిన ప్రశ్నకు ఊహించని విధంగా పన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న 'భీమ్లా నాయక్' సినిమాలోని 'లా లా భీమ్లా' సాంగ్ అని చెప్పి ఆశ్చర్యపరచింది. ఇప్పుడు ఈ సాంగ్ నిధి ఫేవరేట్ సాంగ్ అని..రిపీటెడ్‌గా వింటున్నానని చెప్పుకొచ్చింది. ఇక నిధి చేతిలో 'వీరమల్లు' చిత్రంతో పాటు గల్లా అశోక్ డెబ్యూ సినిమా 'హీరో'లో నటిస్తోంది. పవన్ సరసన నటిస్తున్న 'హరిహర వీరమల్లు' సినిమా గనక భారీ హిట్ సాధిస్తే ఖచ్చితంగా నిధి కెరీర్‌కు పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందనడంలో సందేహమే లేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Updated Date - 2021-12-30T14:01:10+05:30 IST