‘ఇండియన్ 2’: శంకర్‌ని అన్నివైపులా బంధిస్తోన్న లైకా

ABN , First Publish Date - 2021-05-15T02:59:09+05:30 IST

సంచలన దర్శకుడు శంకర్‌ని అన్ని వైపులా బంధించాలని చూస్తోంది లైకా ప్రొడక్షన్స్ బ్యానర్. కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ ‘ఇండియన్ 2’ చిత్రాన్ని భారీగా నిర్మించాలని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. కొంత పార్ట్ చిత్రీకరణ జరిగిన తర్వాత సెట్‌లో

‘ఇండియన్ 2’: శంకర్‌ని అన్నివైపులా బంధిస్తోన్న లైకా

సంచలన దర్శకుడు శంకర్‌ని అన్ని వైపులా బంధించాలని చూస్తోంది లైకా ప్రొడక్షన్స్ బ్యానర్. కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ ‘ఇండియన్ 2’ చిత్రాన్ని భారీగా నిర్మించాలని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. కొంత పార్ట్ చిత్రీకరణ జరిగిన తర్వాత సెట్‌లో జరిగిన భారీ ప్రమాదంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఆ తర్వాత ఈ చిత్రం పూర్తిగా ఆగిపోయినట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై ప్రస్తుతం కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. శంకర్ కారణంగానే ‘ఇండియన్ 2’ చిత్రం ఆగిపోయిందని లైకా ప్రొడక్షన్స్, కాదు లైకా కారణంగానే చిత్రం ఆగిందని డైరెక్టర్ శంకర్ ఆరోపణలు చేసుకుంటూ కోర్టుని ఆశ్రయించారు. అనేక విచారణల తర్వాత కోర్టు తీర్పును జూన్‌కి వాయిదా వేసింది. ఈ కేసు కోర్టులో ఉండగానే శంకర్ తన తదుపరి చిత్రాలుగా రెండు ప్రాజెక్ట్స్‌ని ప్రకటించాడు. 


అందులో ఒకటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మించనున్న పాన్ ఇండియా చిత్రం కాగా.. మరో చిత్రం బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో తమిళ ‘అన్నియన్’ రీమేక్. వెంటవెంటనే శంకర్ ఈ రెండు ప్రాజెక్ట్స్‌ని ప్రకటించడంతో లైకా ప్రొడక్షన్స్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో వివాదం మరింతగా ముదిరింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం లైకా ప్రొడక్షన్స్ ఓ అడుగు ముందుకేసి.. శంకర్ తదుపరి చిత్రాలను నిలువరించడానికి చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. ‘ఇండియన్ 2’ చిత్రం పూర్తి చేయకుండా మరో చిత్రానికి శంకర్‌ని దర్శకత్వం వహించకుండా చూడాలని టాలీవుడ్, బాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్లకు లైకా ప్రొడక్షన్స్ లేఖ పంపినట్లుగా కోలీవుడ్‌ మీడియాలో కథనాలు వినబడుతున్నాయి. ఇదే నిజమైతే శంకర్‌కు కొత్త తలనొప్పులను లైకా కలిగించినట్లే. మరి లైకా ఈ స్టెప్‌పై శంకర్ రియాక్షన్ ఎలా ఉంటుందో వేచి చూడాలి. 

Updated Date - 2021-05-15T02:59:09+05:30 IST