గీత కార్మికుల జీవ‌న నేప‌థ్యంలో...

ABN , First Publish Date - 2021-01-28T00:46:21+05:30 IST

కోలీవుడ్‌కు తొలిసారి పరిచయం అవుతున్న దర్శకులు నందా లక్ష్మణ్‌, ఏఆర్‌.రాజేష్‌. వీరిద్దరు కలిసి తెరకెక్కిస్తున్న చిత్రం ‘నెడుమి’.

గీత కార్మికుల జీవ‌న నేప‌థ్యంలో...

కోలీవుడ్‌: కోలీవుడ్‌కు తొలిసారి పరిచయం అవుతున్న దర్శకులు నందా లక్ష్మణ్‌, ఏఆర్‌.రాజేష్‌. వీరిద్దరు కలిసి తెరకెక్కిస్తున్న చిత్రం ‘నెడుమి’. ప్రదీప్‌ సెల్వరాజ్‌, అభినయ హీరో హీరో యిన్లుగా నటిస్తున్నారు. 1990 నాటి పరిస్థితుల ఆధారంగా ఈ మూవీ కథను తయారు చేశారు. ఈ చిత్రం గురించి దర్శకులు మాట్లాడుతూ, తాటిచెట్టుకు మరోపేరే ‘నెడుమి’. ఇందులో కల్లు గీత కార్మికుల జీవననేపథ్యం, వారు పడుతు న్న కష్టాలను నేపథ్యంగా చేసుకుని ఈ చిత్రాన్ని నిర్మిస్తు న్నాం.ముఖ్యంగా కల్లు గీత కోసం తాటి చెట్టు ఎక్కిదిగే సమయాల్లో వారు పడే కష్టాలలో రాజకీయ నేతల జోక్యం తదితర అంశాలను చూపించనున్నట్టు తెలిపారు. జాస్‌ జేపీ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రం షూటింగు ను పూర్తిగా విల్లుపురం జిల్లా మార్తాండంలో పూర్తి చేయనున్నట్టు తెలిపారు.ఎం.వేల్‌మురుగన్‌ నిర్మిస్తున్న  ఈ మూవీని తమిళ, మలయాళ భాషల్లో నిర్మిస్తున్నట్టు తెలిపారు.

Updated Date - 2021-01-28T00:46:21+05:30 IST