నయన్-విఘ్నేష్.. హాట్ సెలబ్రేషన్స్!
ABN, First Publish Date - 2021-01-01T21:56:01+05:30
కోలీవుడ్ హాట్ లవర్స్ నయనతార, విఘ్నేష్ శివన్ నూతన సంవత్సర వేడుకలను రొమాంటిక్‌గా జరుపుకున్నారు.
కోలీవుడ్ హాట్ లవర్స్ నయనతార, విఘ్నేష్ శివన్ నూతన సంవత్సర వేడుకలను రొమాంటిక్‌గా జరుపుకున్నారు. అభిమానులకు, స్నేహితులకు న్యూ ఇయర్ విషెస్ చెబుతూ విఘ్నేష్ శివన్ రెండు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఆ ఫొటోల్లో నయన్ హాట్‌గా, రొమాంటిక్‌గా కనిపించింది.
ఈ ఫొటోతో పాటు విఘ్నేష్ శివన్ ఓ సందేశాన్ని కూడా పోస్ట్ చేశాడు. `నా, మా తరఫున నుంచి మీకు, మీవారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని దశను దాటేశాము. అత్యంత సంతోషకరమైన 2021లోకి ప్రవేశించాం. అందరూ సంతోషంగా, విజయవంతంగా, ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో, తృప్తిగా, ప్రేమపూర్వకంగా ఉండాలని కోరుకుంటున్నా. మనందరికీ ఈ కొత్త సంవత్సరం అద్భుతంగా ఉండాల`ని విఘ్నేష్ శివన్ ఆకాంక్షించాడు.