#RRR : నాటు.. నాటు ప్రోమో వచ్చేసింది!
ABN , First Publish Date - 2021-11-09T17:39:32+05:30 IST
యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా.. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం వచ్చే ఏడాది జనవరి 7 ఈ పాన్ ఇండియా మూవీ విడుదల కాబోతోంది. ఇటీవల సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సీజీ వర్క్ జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన మూడు టీజర్స్, ఒక సింగిల్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది.

యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా.. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం వచ్చే ఏడాది జనవరి 7 ఈ పాన్ ఇండియా మూవీ విడుదల కాబోతోంది. ఇటీవల సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సీజీ వర్క్ జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన మూడు టీజర్స్, ఒక సింగిల్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో రేపు (బుధవారం ) ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీలోని ‘నాటు.. నాటు’ అంటూ సాగే ఓ మాస్ లిరికల్ సాంగ్ ను విడుదల చేయబోతున్నారు. కీరవాణి సంగీతం అందించిన ఈ సాంగ్ ప్రోమో ను ఈ రోజు (మంగళవారం) విడుదల చేశారు మేకర్స్.
‘నా పాట చూడు.. నా పాట చూడు .. నాటు నాటు నాటు నాటు.. వీర నాటు’ అంటూ సాగే ఈ పాటని అదిరిపోయే రేంజ్ లో ట్యూన్ చేశారు కీరవాణి. టాలీవుడ్ లో టాప్ మోస్ట్ డ్యాన్సింగ్ స్టార్స్ అయిన తారక్, చెర్రీలు కలిసి ఒకే స్ర్కీన్ పై నర్తించనుండడం ఈ పాటకే హైలైట్ కాబోతోంది. నిజంగా ఇది అభిమానులకు కన్నుల పండగే. మాస్ జనం నాడిని పట్టుకోవడంలో చెయితిరిగిన రాజమౌళి.. ఈ ఒక్క పాటతోనూ సినిమాకు భారీ హైప్ తెస్తారని వేరే చెప్పాలా? ఈ పాటను చంద్రబోసు రచించగా.. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించారు. మరి ఈ పాట వెండితెరపై ఏ రేంజ్ లో అరిపిస్తుందో చూడాలి.