జయంతిగారి మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు: వి.కె.న‌రేశ్‌

ABN , First Publish Date - 2021-07-26T20:19:43+05:30 IST

దక్షిణాదితో పాటు ఉత్త‌రాది సినిమాల్లోనూ ప‌లు వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో న‌టించిన ఆమె మృతిపై సినీ పరిశ్ర‌మ సంతాపాన్ని వ్య‌క్తం చేసింది. ఈ క్ర‌మంలో న‌టుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు వి.కె.న‌రేశ్ జ‌యంతి మృతిపై సంతాపాన్ని వ్య‌క్తం చేస్తూ ఓ వీడియో విడుద‌ల చేశారు.

జయంతిగారి మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు:  వి.కె.న‌రేశ్‌

సీనియ‌ర్ న‌టి, నిర్మాత‌, ద‌ర్శ‌కురాలు జ‌యంతి ఆదివారం రాత్రి క‌న్నుమూసిన సంగతి తెలిసిందే. దక్షిణాదితో పాటు ఉత్త‌రాది సినిమాల్లోనూ ప‌లు వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో న‌టించిన ఆమె మృతిపై సినీ పరిశ్ర‌మ సంతాపాన్ని వ్య‌క్తం చేసింది. ఈ క్ర‌మంలో న‌టుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు వి.కె.న‌రేశ్ జ‌యంతి మృతిపై సంతాపాన్ని వ్య‌క్తం చేస్తూ ఓ వీడియో విడుద‌ల చేశారు. ‘‘అలనాటి అగ్ర నటి, అందాల నటి శ్రీమతి జయంతిగారు మరణించడం ఎంతో బాధాక‌ర‌మైన విష‌యం. ఆమెను ఆల్ ఇండియా న‌టి అని చెప్పొచ్చు. ఎందుకంటే, తెలుగులోనే కాదు.. తమిళ, హిందీ, మరాఠీ, కన్నడ, మలయాళ భాష‌ల్లో న‌టించారు. అప్ప‌ట్లో జయంతిగారు హ‌యాం కొన‌సాగించారు.  న‌ట‌న‌, అందం, మంచిత‌నం చ‌రిత్ర‌లో మిగిలిపోయేవి. ఆవిడ మ‌ర‌ణం ద‌క్షిణ భార‌త సినీ ప‌రిశ్ర‌మ‌కు తీర‌నిలోటుగా నేను భావిస్తున్నాను. ఆఖ‌రి శ్వాస వ‌ర‌కు సినీ ప‌రిశ్ర‌మ‌కు త‌న జీవితాన్ని అంకితం చేశారు. నా అమ్మ‌గారైన విజ‌య‌నిర్మ‌ల‌గారి ద‌ర్శ‌క‌త్వంలోనూ జ‌యంతిగారు ఎన్నో సినిమాలు చేశారు. దేవ‌దాస్ చిత్రంలో చంద్ర‌ముఖి పాత్ర‌ను అద్భుతంగా పోషించారు. నా తొలి చిత్రం ప్రేమ సంకెళ్లులోనూ ఆమె న‌టించారు. ఆమె లేని లోటు ఎవ‌రూ తీర్చ‌లేనిది. కృష్ణ‌గారి త‌ర‌పున‌, మా కుటుంబం త‌ర‌పున ఆమె కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తూ, ఆమె ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు. 



Updated Date - 2021-07-26T20:19:43+05:30 IST