గ్లామర్ రోల్స్.. ఇవ్వండి ప్లీజ్
ABN , First Publish Date - 2021-03-19T03:11:44+05:30 IST
తమిళ, తెలుగు సినిమాల్లో రాణిస్తున్న హీరోయిన్లలో నందితా శ్వేత ఒకరు. కోలీవుడ్‌లో ఈ యేడాది ఈమె నటించిన మూడు చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. సంక్రాంతికి

కోలీవుడ్: తమిళ, తెలుగు సినిమాల్లో రాణిస్తున్న హీరోయిన్లలో నందితా శ్వేత ఒకరు. కోలీవుడ్‌లో ఈ యేడాది ఈమె నటించిన మూడు చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. సంక్రాంతికి శింబు నటించిన ‘ఈశ్వరన్’ విడుదల కాగా, ఆ తర్వాత శిబి సత్యరాజ్ నటించిన ‘కబడదారి’ విడుదలైంది. తాజాగా దర్శకహీరో ఎస్.జె.సూర్య నటించిన ‘నెంజమ్ మరప్పదిల్లై’ రిలీజైంది. అయితే ఈ మూడు చిత్రాలూ ఆమెను తీవ్ర నిరాశకు లోను చేశాయి. ముఖ్యంగా ఈశ్వరన్, కబడదారి చిత్రాల్లో ఆమె పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేదని చెప్పొచ్చు. కానీ, ‘నెంజమ్ మరప్పదిల్లై’ చిత్రంలో నందితా శ్వేత కీలక పాత్రనే పోషించింది. ఆమె నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి.
కానీ, చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో ఆమె తీవ్ర నిరాశకు లోనయ్యింది. అదే సమయంలో వరుసగా హోమ్లీ పాత్రలే వస్తుండడం కూడా ఆమెకు నచ్చడం లేదు. గ్లామర్ పాత్రలకు తాను సూటవుతానంటూ కొన్ని ఫొటో షూట్‌లు నిర్వహించి వాటిని సోషల్ మీడియాలో ఆమె షేర్ చేస్తోంది. ఈ ఫోటోలు చూసిన తర్వాతైనా నిర్మాతలు తనకు గ్లామర్ పాత్రల్లో నటించే అవకాశం ఇస్తారన్న ఆశతో వుంది.