కొత్త లుక్కు... అదిరేట్టు!
ABN , First Publish Date - 2021-05-15T04:17:51+05:30 IST
రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు శుక్రవారం నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఓ వీడియో విడుదల చేశారు. అందులో సాల్ట్ అండ్ పెప్పర్ స్టయిల్...

రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు శుక్రవారం నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఓ వీడియో విడుదల చేశారు. అందులో సాల్ట్ అండ్ పెప్పర్ స్టయిల్ మీసం, గడ్డంతో తలపై టోపీ ధరించి కనిపించారు. ఈ లుక్ అదిరేట్టు ఉందని అభిమానులు సంతోషంగా పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ‘అఖండ’ చిత్రంలో బాలకృష్ణ నటిస్తున్నారు. అందులో లుక్కు ఈ విధంగానే ఉంటుంది. మరో పది పదిహేను రోజులు చిత్రీకరణ చేస్తే ఆ సినిమా పూర్తి కానుంది.