నల్లమల చీకటి కోణాలతో...

ABN , First Publish Date - 2021-10-04T07:25:36+05:30 IST

‘‘ప్రతిభావంతులైన నటీనటుల ఎంపికతోనే ‘నల్లమల’ సగం విజయం సాధించింది. ఈ సినిమా అద్భుతాలు సృష్టిస్తుందని నమ్ముతున్నాను. ఈ సినిమాలోని ‘ఏమున్నవే పిల్ల’ లాంటి పాట...

నల్లమల చీకటి కోణాలతో...

‘‘ప్రతిభావంతులైన నటీనటుల ఎంపికతోనే ‘నల్లమల’ సగం విజయం సాధించింది. ఈ సినిమా అద్భుతాలు సృష్టిస్తుందని నమ్ముతున్నాను. ఈ సినిమాలోని ‘ఏమున్నవే పిల్ల’ లాంటి పాట నా సినిమాల్లో ఇప్పటిదాకా ఒక్కటి కూడా లేదనే అసూయ కలిగింది’’ అని దర్శకుడు దేవ కట్టా అన్నారు. నల్లమల అడవికి సంబంధించిన చీకటి కోణాలను స్పృశిస్తూ రూపొందిన చిత్రం ‘నల్లమల’. విలన్‌ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న అమిత్‌ తివారి హీరోగా నటించారు. భానుశ్రీ కథానాయిక. నాజర్‌, తనికెళ్ల భరణి, అజయ్‌ ఘోష్‌, కాలకేయ ప్రభాకర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. రవిచరణ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆర్‌.ఎం. నిర్మాత. టీజర్‌ విడుదల చేసిన దర్శకుడు దేవ కట్టా, సినిమా విజయం సాధించాలన్నారు. ఈ సందర్భంగా అమిత్‌ తివారి మాట్లాడుతూ ‘‘నాకు విలన్‌ పాత్ర ఇస్తారనుకున్నాను. కానీ హీరోగా అవకాశం ఇచ్చారు. ఈ సినిమాకు అసలు హీరో కథే’’ అని అన్నారు. ‘‘దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో నల్లమల అడవుల నేపథ్యంలో జరిగిన ఆసక్తికర సంఘటనల నేపథ్యంలో సినిమాను తెరకెక్కించాం’’ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి పీఆర్‌ సంగీత దర్శకుడు.


Updated Date - 2021-10-04T07:25:36+05:30 IST