సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Nagasourya : ఒకే రోజు డబుల్ ధమాకా

ABN, First Publish Date - 2021-12-29T22:29:18+05:30

యంగ్ హీరో నాగశౌర్య ఈ ఏడాది ‘వరుడు కావలెను, లక్ష్య’ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించారు. అందులో ఒకటి పూర్తి ఫ్యామిలీ డ్రామా కాగా, మరొకటి స్పోర్ట్స్ డ్రామా. ఇందులో మరో విశేషమేంటంటే. ఈ రెండు చిత్రాల్ని కొత్త దర్శకులే తెరకెక్కించారు. లక్ష్మీ సౌజన్య అనే కొత్త దర్శకురాలు తెరకెక్కించిన ‘వరుడు కావలెను’ చిత్రం యావరేజ్ గా నిలవగా.. సంతోష్ జాగర్లపూడి అనే కొత్త దర్శకుడు రూపొందించిన ‘లక్ష్య’ చిత్రం బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. ఈ రెండు చిత్రాలు వేరే వేరు డేట్స్ లో థియేటర్స్ లోకి వచ్చినా.. ఈ రెండు సినిమాల్ని ఒకే రోజు ప్రేక్షకులు ఇంట్లో కూర్చుని చూసే సమయం ఆసన్నమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యంగ్ హీరో నాగశౌర్య ఈ ఏడాది ‘వరుడు కావలెను, లక్ష్య’ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించారు. అందులో ఒకటి పూర్తి ఫ్యామిలీ డ్రామా కాగా, మరొకటి స్పోర్ట్స్ డ్రామా.  ఇందులో మరో విశేషమేంటంటే. ఈ రెండు చిత్రాల్ని కొత్త దర్శకులే తెరకెక్కించారు. లక్ష్మీ సౌజన్య అనే కొత్త దర్శకురాలు తెరకెక్కించిన ‘వరుడు కావలెను’ చిత్రం యావరేజ్ గా నిలవగా.. సంతోష్ జాగర్లపూడి అనే కొత్త దర్శకుడు రూపొందించిన ‘లక్ష్య’ చిత్రం బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. ఈ రెండు చిత్రాలు వేరే వేరు డేట్స్ లో థియేటర్స్ లోకి వచ్చినా.. ఈ రెండు సినిమాల్ని ఒకే రోజు ప్రేక్షకులు ఇంట్లో కూర్చుని చూసే సమయం ఆసన్నమైంది. అంటే ఈ రెండు సినిమాలు ఒకే రోజు ఓటీటీలో విడుదల కాబోతున్నయన్నమాట. ఒక రకంగా నాగశౌర్య నుంచి ప్రేక్షకులకిది డబుల్ ధమాకా కిందే లెక్క. 


వచ్చే ఏడాది జనవరి 7న జీ5 లో వరుడు కావలెను చిత్రం స్ట్రీమ్ అవుతుండగా.. అదే రోజు ‘లక్ష్య’ చిత్రం ఆహా ఓటీటీలో స్ట్రీమ్ కానుంది. ఇలా ఒకే రోజు ఒకే హీరో నుంచి రెండు సినిమాలు ఓటీటీలో విడుదలడం ఎప్పుడూ జరగలేదు. ఆ రకంగా ఈ విషయంలో నాగశౌర్య రికార్డ్ క్రియేట్ చేసినట్టే అనుకోవాలి. మరి థియేటర్స్ లో అంతగా మ్యాజిక్ చేయలేకపోయిన ఈ రెండు సినిమాలు ఓటీటీలో ఏ రేంజ్ లో మెప్పిస్తాయో చూడాలి. 

Updated Date - 2021-12-29T22:29:18+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!