ఓటీటీలో వచ్చేస్తోన్న నాగశౌర్య ‘లక్ష్య’

ABN , First Publish Date - 2021-12-28T19:03:47+05:30 IST

యంగ్ హీరో నాగశౌర్య నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘లక్ష్య’. సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాకి దర్శకుడు. ఆర్చరీ బ్యాక్ డ్రాప్ లో సాగే యాక్షన్ మూవీ కోసం నాగశౌర్య విపరీతంగా కష్టపడ్డాడు. జిమ్ లో గంటల తరబడి కసరత్తులు చేసి ఎయిట్ ప్యాక్ సైతం బిల్డ్ చేశాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. ‘లక్ష్య’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన రీతిలో అలరించలేకపోయింది. ఆర్చరీ పై అంతగా అవగాహన లేకపోవడంతో.. ఈ సినిమా సామాన్య ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది.

ఓటీటీలో వచ్చేస్తోన్న నాగశౌర్య ‘లక్ష్య’

యంగ్ హీరో నాగశౌర్య నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘లక్ష్య’. సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాకి దర్శకుడు.  ఆర్చరీ బ్యాక్ డ్రాప్ లో సాగే యాక్షన్ మూవీ కోసం నాగశౌర్య విపరీతంగా కష్టపడ్డాడు. జిమ్ లో గంటల తరబడి కసరత్తులు చేసి ఎయిట్ ప్యాక్ సైతం బిల్డ్ చేశాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. ‘లక్ష్య’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన రీతిలో అలరించలేకపోయింది. ఆర్చరీ పై అంతగా అవగాహన లేకపోవడంతో.. ఈ సినిమా సామాన్య ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది. కేతికా శర్మ కథానాయికగా నటించగా.. జగపతి బాబు, సచిన్ ఖేడేకర్, శత్రు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమ్ అయ్యే డేట్ వచ్చేసింది. 


వచ్చే ఏడాది జనవరి 7న ఆహా ఓటీటీలో స్ట్రీమ్ కాబోతోంది. సరిగ్గా అదే రోజు యన్టీఆర్, రామ్ చరణ్ ల క్రేజీ మల్టీస్టారర్ థియేటర్స్‌లో సందడి చేయబోతోంది.  ఈ నెల 10న థియేటర్స్ లో విడుదలైన లక్ష్య చిత్రం.. కేవలం 27 రోజుల తేడాతో ఓటీటీలో రానుండడం గమనార్హం. మరి ఓటీటీలోనైనా ఈ సినిమా కు మంచి రీచ్ ఉంటుందేమో చూడాలి. 




Updated Date - 2021-12-28T19:03:47+05:30 IST