నిన్ను మళ్ళీ తెరపై చూడడం ఆనందంగా ఉంది అమల : నాగార్జున
ABN , First Publish Date - 2021-12-30T16:56:20+05:30 IST
అక్కినేని నాగార్జున, అమల ఒకప్పడు సూపర్ హిట్ జోడీ. నాగ్ ను పెళ్లి చేసుకున్నాకా... సినిమాలకు గుడ్ బై చెప్పి.. పూర్తిగా గృహ నిర్వాహణ బాధ్యతలకే పరిమితమైపోయారు అమల. అఖిల్ పుట్టాకా.. ఆమె బాధ్యత మరింత పెరిగింది. దాంతో ఆమె మళ్ళీ తెరపై కనిపించలేదు. 1993 లో వచ్చిన రాజశేఖర్ ‘ఆగ్రహం’ ఆమె ఆఖరి తెలుగు చిత్రం. ఆ తర్వాత 2012 లో శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు అమల. ఆ తర్వాత ‘కేరాఫ్ సైరాభాను’ మలయాళ చిత్రంలోనూ, ‘మనం’ చిత్రంలో డ్యాన్స్ టీచర్ గానూ కనిపించారు.

అక్కినేని నాగార్జున, అమల ఒకప్పడు సూపర్ హిట్ జోడీ. నాగ్ ను పెళ్లి చేసుకున్నాకా... సినిమాలకు గుడ్ బై చెప్పి.. పూర్తిగా గృహ నిర్వాహణ బాధ్యతలకే పరిమితమైపోయారు అమల. అఖిల్ పుట్టాకా.. ఆమె బాధ్యత మరింత పెరిగింది. దాంతో ఆమె మళ్ళీ తెరపై కనిపించలేదు. 1993 లో వచ్చిన రాజశేఖర్ ‘ఆగ్రహం’ ఆమె ఆఖరి తెలుగు చిత్రం. ఆ తర్వాత 2012 లో శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు అమల. ఆ తర్వాత ‘కేరాఫ్ సైరాభాను’ మలయాళ చిత్రంలోనూ, ‘మనం’ చిత్రంలో డ్యాన్స్ టీచర్ గానూ కనిపించారు. ఇప్పుడు మరోసారి అమల వెండితెరపై పూర్తి స్థాయిలో కనిపించేందుకు రెడీ అవుతున్నారు. సినిమా పేరు ‘ఒకే ఒక జీవితం’.
శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి కార్తిక్ దర్శకుడు. టైమ్ మెషీన్ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ మూవీ. తమిళంలో ‘కణం’ పేరుతో విడుదలవుతోంది. ఈ సినిమా టీజర్ నిన్ననే (బుధవారం) విడుదలైంది. టీజర్ ఆకట్టుకుంటోంది. టీజర్ ను అప్రిషియేట్ చేస్తూ నాగార్జున ట్వీట్ చేశారు. భార్య అమల ను ఉద్దేశిస్తూ.. ‘నిన్ను మళ్ళీ తెరపై చూడడం ఆనందంగా ఉంది అమల. ‘ఒకే ఒక జీవితం టీమ్ కు ఆల్ ది బెస్ట్’ అంటే ట్వీట్ చేశారు. రీతూ వర్మ కథానాయికగా నటిస్తున్న ‘ఒకే ఒక జీవితం’ లో నాజర్ కీలక పాత్ర పోషిస్తున్నారు.