సెట్స్‌పైకి నాగ్ - ప్రవీణ్ సత్తారు మూవీ

ABN , First Publish Date - 2021-08-05T14:27:55+05:30 IST

కింగ్ నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం కొత్త షెడ్యూల్ మొదలైంది. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ గోవాలో పూర్తి చేశారు. ఆ తర్వాత కరోనా సెకండ్ వేవ్ కారణంగా చిత్రీకరణ నిలిచిపోయింది.

సెట్స్‌పైకి నాగ్ - ప్రవీణ్ సత్తారు మూవీ

కింగ్ నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం కొత్త షెడ్యూల్ మొదలైంది. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ గోవాలో పూర్తి చేశారు. ఆ తర్వాత కరోనా సెకండ్ వేవ్ కారణంగా చిత్రీకరణ నిలిచిపోయింది. విదేశాలలో షెడ్యూల్స్ ప్లాన్ చేసిన మేకర్స్ ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్‌లోనే షూటింగ్ ప్రారంభించారు. ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ ఆగస్ట్ 4న హైదరాబాద్‌లో ప్రారంభమవగా, నాగార్జునపై వేశాలను చిత్రీరించారు. కాజల్ అగర్వాల్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ వెంక‌టేశ్వ‌ర ఎల్ఎల్‌పి - నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకాల‌పై నారాయ‌ణ్ దాస్ కె.నారంగ్‌ - పుస్కూర్ రామ్మోహ‌న్‌రావు, శ‌ర‌త్ మరార్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇక నాగార్జున పుట్టినరోజు సందర్భంగా, ఆగస్ట్ 29న ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ లేదా టైటిల్ అనౌన్స్ చేయనున్నట్టు సమాచారం.  

Updated Date - 2021-08-05T14:27:55+05:30 IST