'ఘోస్ట్'గా నాగార్జున.. ఫస్ట్ లుక్ విడుదల

ABN , First Publish Date - 2021-08-29T16:38:13+05:30 IST

టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున 'ఘోస్ట్'గా రాబోతున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోంది.

'ఘోస్ట్'గా నాగార్జున.. ఫస్ట్ లుక్ విడుదల

టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున 'ఘోస్ట్'గా రాబోతున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోంది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. నేడు (ఆగస్ట్ 29) నాగార్జున బర్త్ డే సందర్భంగా 'ది ఘోస్ట్' అనే టైటిల్‌తో పాటు మూవీలోని ఆయన ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే అంతర్జాతీయ కథాంశంతో రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్‌ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.  Updated Date - 2021-08-29T16:38:13+05:30 IST