తెలుగులో నభా.. మలయాళంలో రాశీ
ABN , First Publish Date - 2021-01-28T10:44:57+05:30 IST
రాశీ ఖన్నా మలయాళంలో మరో సినిమా చేయనున్నారు.హిందీలో విజయవంతమైన ‘అంధాధున్’లో రాధికా ఆప్టే పోషించిన పాత్రలో ఆమె...

రాశీ ఖన్నా మలయాళంలో మరో సినిమా చేయనున్నారు.హిందీలో విజయవంతమైన ‘అంధాధున్’లో రాధికా ఆప్టే పోషించిన పాత్రలో ఆమె నటించనున్నారు. దీనిలో పృథ్వీరాజ్ సుకుమారన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. హిందీలో టబు చేసిన పాత్రకు మమతా మోహన్‌దా్‌సను ఎంపిక చేశారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు బుధవారం కొచ్చిలో నిర్వహించారు. తెలుగులో నితిన్ హీరోగా ‘అంధాధున్’ రీమేక్ అవుతోన్న సంగతి తెలిసిందే. దీనిలో రాధికా అప్టే పాత్రను నభా నటేశ్, టబు పాత్రను తమన్నా చేస్తున్నారు. ప్రస్తుతం మలయాళంలో ‘అంధాధున్’ రీమేక్‌తో పాటు మూడు తమిళ చిత్రాల్లో రాశీ ఖన్నా నటిస్తున్నారు. అలాగే, షాహిద్ కపూర్‌తో దర్శకద్వయం రాజ్-డీకే రూపొందిస్తున్న వెబ్ సిరీస్ చేస్తున్నారు. గతంలో మలయాళంలో ‘విలన్’ సినిమాలో కూడా నటించారు.