దర్శకుడిగా సక్సెస్ అవ్వాలి
ABN , First Publish Date - 2021-11-01T06:37:23+05:30 IST
ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘అతడు-ఆమె-ప్రియుడు’. ప్రస్తుతం నిర్మాణా నంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి...

ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘అతడు-ఆమె-ప్రియుడు’. ప్రస్తుతం నిర్మాణా నంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సునీల్, కౌశల్, బెనర్జీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రవి కనగాల, రామ్ తుమ్మల పల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను దర్శకుడు రాఘవేంద్రరావు విడుదల చేశారు. ‘రచయితగా గొప్ప పేరు తెచ్చుకున్న యండమూరి వీరేంద్రనాథ్ ఈ చిత్రంతో దర్శకుడిగా మంచి విజయం అందుకోవాలి’ అని ఆయన ఆకాంక్షించారు.