పెళ్లి చేసుకుంటానని నమ్మించి టీవీ నటిపై పైలెట్ అత్యాచారం

ABN , First Publish Date - 2021-01-19T14:58:55+05:30 IST

పెళి చేసుకుంటానని నమ్మించి ఓ టీవీ నటిపై విమాన పైలెట్ అత్యాచారం జరిపిన ఘటన ....

పెళ్లి చేసుకుంటానని నమ్మించి టీవీ నటిపై పైలెట్ అత్యాచారం

ముంబై : పెళి చేసుకుంటానని నమ్మించి ఓ టీవీ నటిపై విమాన పైలెట్ అత్యాచారం జరిపిన ఘటన మహారాష్ట్రలోని ముంబై నగరంలో వెలుగుచూసింది. వివాహం సాకుతో తనపై పైలెట్ అత్యాచారం చేశాడని టీవీ నటి ముంబై నగరంలోని ఓషివారా పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేసింది. బాధిత టీవీ నటికి నిందితుడు పైలెట్ మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా  పరిచయమయ్యాడు. నిందితుడు తరచూ ఫోన్ లో మాట్లాడేవాడని, తామిద్దరం సోషల్ మీడియాలో ఛాట్ చేసేవారమని బాధితురాలు పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో తెలిపారు. పదిరోజుల క్రితం నిందితుడు కలిసేందుకు తమ ఇంటికి వచ్చి వివాహం చేసుకుంటానని వాగ్ధానం చేశాడు. నిందితుడు తనపై పలుసార్లు అత్యాచారం చేశాడని టీవీనటి పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం కొన్ని రోజుల తర్వాత తనతో మాట్లాడటం మానేశాడని, తనపై అత్యాచారం చేసి, తనను వివాహం చేసుకోవడానికి నిరాకరించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Updated Date - 2021-01-19T14:58:55+05:30 IST