‘మిస్టర్ బెగ్గర్’... ఎంతో హ్యూమర్!
ABN , First Publish Date - 2021-11-16T05:46:17+05:30 IST
సంపూర్ణేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ బెగ్గర్’. అద్వితి శెట్టి కథానాయిక. గురురాజ్, కార్తీక్ నిర్మాతలు. వడ్ల జనార్థన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం సోమవారం ఉదయం హైదరాబాద్ లో ప్రారంభమైంది...

సంపూర్ణేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ బెగ్గర్’. అద్వితి శెట్టి కథానాయిక. గురురాజ్, కార్తీక్ నిర్మాతలు. వడ్ల జనార్థన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం సోమవారం ఉదయం హైదరాబాద్ లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నటుడు సత్య ప్రకాష్ క్లాప్‌నిచ్చారు. రాజు కెమెరా స్విచ్చాన్ చేశారు. వి. సముద్ర గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘హృదయ కాలేయం నుంచీ తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరిస్తూనే ఉన్నారు. వాళ్లందరికీ కావల్సినంత హ్యూమర్ పంచడానికి ఈ సినిమా చేస్తున్నాం. సత్య ప్రకాష్ లాంటి సీనియర్ నటుడితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంద’’న్నారు సంపూ. ‘‘సరదాగా సాగే కుటుంబ కథా చిత్రమిది. సంపూ మేనరిజానికి తగినట్టుగా స్ర్కిప్టు రూపొందించాం. గోవాలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తామ’’ని దర్శకుడు తెలిపారు. అలీ, బాబూ మోహన్, ఫృథ్వీ, రఘుబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: పి.ఆర్.