పారా సైకాలజీ నేపథ్యంలో...
ABN, First Publish Date - 2021-09-25T06:29:02+05:30
‘మల్లెపువ్వు’ ఫేమ్ మురళి, భానుశ్రీ జంటగా అల్లూరి సూర్యప్రసాద్, సంధ్యా రవి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘మౌనం’. వాయిస్ ఆఫ్ సైలెన్స్ అనేది ఉపశీర్షిక. కిషన్ సాగర్ దర్శకుడు. ‘‘నా మిత్రుడు మురళి నటించిన ‘మౌనం’...
‘మల్లెపువ్వు’ ఫేమ్ మురళి, భానుశ్రీ జంటగా అల్లూరి సూర్యప్రసాద్, సంధ్యా రవి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘మౌనం’. వాయిస్ ఆఫ్ సైలెన్స్ అనేది ఉపశీర్షిక. కిషన్ సాగర్ దర్శకుడు. ‘‘నా మిత్రుడు మురళి నటించిన ‘మౌనం’, మణిరత్నం తీసిన ‘మౌనరాగం’లా విజయం సాధించాలి’’ అని ట్రైలర్ విడుదల చేసిన రమేశ్‌వర్మ ఆకాంక్షించారు. ‘‘పారా సైకాలజీ నేపథ్యంలో వినూత్న ప్రేమకథతో తెరకెక్కిన థ్రిల్లర్ చిత్రమిది. ఎం.ఎం. శ్రీలేఖ సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణ. అక్టోబర్ తొలి వారంలో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని దర్శక-నిర్మాతలు తెలిపారు.