మోహానికీ ప్రేమకూ మధ్య ...
ABN, First Publish Date - 2021-10-25T09:10:18+05:30
‘‘మోహానికీ ప్రేమకూ మధ్య జరిగే కథే ‘రొమాంటిక్’. ప్రేమ, ఆకర్షణ మధ్య ఉన్న సన్నని గీతను ఇందులో చర్చించాం’’ అని దర్శకుడు అనిల్ పాదూరి అన్నారు...
‘‘మోహానికీ ప్రేమకూ మధ్య జరిగే కథే ‘రొమాంటిక్’. ప్రేమ, ఆకర్షణ మధ్య ఉన్న సన్నని గీతను ఇందులో చర్చించాం’’ అని దర్శకుడు అనిల్ పాదూరి అన్నారు. ఆయన దర్శకత్వంలో ఆకాష్ పూరి, కేతిక శర్మ జంటగా నటించిన ‘రొమాంటిక్’ చిత్రం ఈ నెల 29న విడుదలవుతోంది. ఈ సందర ్భంగా సినిమా విశేషాలను అనిల్ పాదూరి పంచుకున్నారు...
కల్యాణ్‌రామ్‌గారితో కలసి వీఎఫ్‌ఎక్స్ కంపెనీ ప్రారంభించాను. ‘టెంపర్’ సినిమా సమయంలో పూరి జగన్నాథ్ గారితో పరిచయమైంది. దర్శకుడు అవ్వాలనే ఆలోచన నాలో రేకెత్తించింది పూరిగారే. పూరిగారితో రైటింగ్ సెషన్స్ పాల్గొనేవాణ్ణి. నేను రాసేవి నచ్చి ‘రొమాంటిక్’ కథను ఇచ్చి డైరెక్ట్ చేయమన్నారు.
ప్రేమంటే నమ్మకం లేని కుర్రాడు ప్రేమలో పడితే ఎలా ఉంటుందనేది కథ. సినిమాలో రొమాన్స్‌తో పాటు ఎమోషనల్ డ్రైవ్ ఉంటుంది.