ఇళయరాజాకు మోహన్‌బాబు కష్టమైన టాస్క్!

ABN , First Publish Date - 2021-02-21T14:46:14+05:30 IST

కలెక్షిన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న దేశభక్తి ప్రధాన చిత్రం `సన్నాఫ్ ఇండియా`.

ఇళయరాజాకు మోహన్‌బాబు కష్టమైన టాస్క్!

కలెక్షిన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న దేశభక్తి ప్రధాన చిత్రం `సన్నాఫ్ ఇండియా`. మోహన్ బాబు స్వయంగా ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందిస్తుండడం విశేషం. డైమండ్‌ రత్నబాబు దర్శకత్వంలో మంచు విష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇళయరాజా స్వరాలందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఈ మ్యూజిక్ సిట్టింగ్స్‌కు సంబంధించిన వీడియోను మంచు విష్ణు తాజాగా ట్విటర్‌లో పోస్ట్ చేశాడు.


శ్రీ రామచంద్రుని గొప్పతనాన్ని కీర్తిస్తూ సాగే `రఘువీర గద్యం`ను ఈ సినిమాలో వినిపించనున్నారు. 11వ శతాబ్దంలో వేదాంత దేశిక కవి క్లిష్టమైన సంస్కృత సమాసాలతో ఈ గద్యాన్ని రచించారు. తన సినిమా కోసం ఈ గద్యానికి బాణీ కట్టాల్సిందిగా ఇళయరాజాని మోహన్ బాబు కోరారు. `జయజయ మహావీర మహాధీర ధోళియ` అంటూ ఈ మోహన్ బాబు ఆ గద్యాన్ని ఆసువుగా ఇళయరాజాకు వినిపించారు. అది విన్న ఇళయరాజా.. `ఏంటిది ఇంత కష్టంగా ఉంది. దీనికి ట్యూన్ ఎలా వస్తుంది? ఎలా చేసేది` అన్నారు. దానికి మోహన్ బాబు స్పందిస్తూ.. `మీరు చేయలేనిది ఏదీ లేదు గురువుగారూ` అంటూ ఆ గద్యాన్ని ఇళయారాజాకు అందించారు. 


Updated Date - 2021-02-21T14:46:14+05:30 IST