మిస్టర్ ప్రెగ్నెంట్!
ABN , First Publish Date - 2021-09-06T04:51:50+05:30 IST
‘బిగ్ బాస్’ ఫేమ్ సయ్యద్ సోహైల్ హీరోగా అన్నపురెడ్డి అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల నిర్మిస్తున్న చిత్రానికి ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ టైటిల్ ఖరారు చేశారు. హీరో ఫస్ట్‌లుక్ విడుదల చేయడంతో పాటు ఆదివారం టైటిల్ ప్రకటించారు.....

‘బిగ్ బాస్’ ఫేమ్ సయ్యద్ సోహైల్ హీరోగా అన్నపురెడ్డి అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల నిర్మిస్తున్న చిత్రానికి ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ టైటిల్ ఖరారు చేశారు. హీరో ఫస్ట్‌లుక్ విడుదల చేయడంతో పాటు ఆదివారం టైటిల్ ప్రకటించారు. ‘‘తెలుగులో సరికొత్త వినోదాత్మక, ప్రేమకథగా మాత్రమే కాదు... ఇదొక ప్రయోగాత్మక చిత్రంగా నిలుస్తుంది. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. త్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాతలు చెప్పారు. ‘‘సినిమాలో సోహైల్ ప్రెగ్నెంట్‌గా కనిపించనున్నారు. అతని పాత్ర, కథాంశం విభిన్నంగా ఉంటాయి. పిల్లలతో పాటు పెద్దలకూ నచ్చేలా ఉంటుందీ సినిమా’’ అని దర్శకుడిగా పరిచయమవుతున్న శ్రీనివాస్ వింజనంపాటి తెలిపారు. రూపా కొడువయూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రావణ్ భరద్వాజ్ సంగీత దర్శకుడు.