Merlapaka gandhi: స్పీడ్ పెంచుతా.. రీమేక్‌లు చేయను
ABN , First Publish Date - 2021-09-13T17:41:00+05:30 IST
'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, 'ఎక్స్‌ప్రెస్ రాజా’ చితాలతో దర్శకుడిగా నిరూపించుకున్నారు మేర్లపాక గాంధీ. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన చిత్రం 'మాస్ట్రో’. హిందీ హిట్ చిత్రం అంధాధూన్’కు రీమేక్ ఇది.
'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, 'ఎక్స్‌ప్రెస్ రాజా’ చితాలతో దర్శకుడిగా నిరూపించుకున్నారు మేర్లపాక గాంధీ. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన చిత్రం 'మాస్ట్రో’. హిందీ హిట్ చిత్రం అంధాధూన్’కు రీమేక్ ఇది. ఈ నెల 17న ఓటీటీ వేదికగా విడుదలకానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మేర్లపాక గాంధీ పంచుకున్న ఆసక్తికర విషయాలు..
అరకు దగ్గర ఊర్లో ఉన్నప్పుడు మా అసిస్టెంట్ చెబితే ‘అంధాధూన్ చూశా. రీమేక్ చేేస్త ఇటువంటి సినిమా చేయాలనుకున్నా. హీరో నితిన్, నిర్మాత సుధాకర్‌రెడ్డి గారు సంప్రదించడంతో అంగీకరించా.
– రీమేక్ చేసేటప్పుడు టెన్షన్ ఉంటుంది. ఉన్నది ఉన్నట్లు తీస్తే.. కాపీ పేస్ట్ అంటారు. మారులు చేేస్త మాతృకను చెడగొట్టాడు అని అంటారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టు కొన్ని మార్పులు చేసి ఈ సినిమా చేశా. ఫైనల్ అవుట్ పుట్ చూశా. హ్యాపీ! ఇకపై రీమేక్స్ చేయను.
– హిందీలో టబు చేసిన పాత్రకు తమన్నాను తీసుకోవాలనే ఆలోచన నాదే. కొన్ని సన్నివేశాల్లో ఆమె నటన చూసి షాకయ్యా! కమర్షియల్ చిత్రాలను చేసిన ఆవిడ అందరూ ఆశ్చర్యపోయేలా నటించారు.
– నేను సినిమాలు స్పీడుగా తీస్తాను. కానీ, కథ రాయడానికి ఎక్కువ సమయం తీసుకుంటా. సినిమా సినిమాకు మధ్య ఎక్కువ గ్యాప్ రావడానికి అదే కారణం. ఇకపై స్పీడ్ పెంచుతా.
