'పుష్ప టీజర్‌పై మెగాస్టార్ ట్వీట్ 'తగ్గేదే లే'..!

ABN , First Publish Date - 2021-04-08T16:59:11+05:30 IST

సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - రష్మిక మందన్న జంటగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'పుష్ప'. మైత్రీ మూవీ మేకర్స్ - ముత్యంశెట్టి మీడియా కసిలి దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

'పుష్ప టీజర్‌పై మెగాస్టార్ ట్వీట్ 'తగ్గేదే లే'..!

సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - రష్మిక మందన్న జంటగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'పుష్ప'. మైత్రీ మూవీ మేకర్స్ - ముత్యంశెట్టి మీడియా కసిలి దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్‌గా కనిపిస్తున్నాడని సమాచారం. ఆగస్ట్ 13న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా సుకుమార్ - అల్లు అర్జున్  - దేవీశ్రీప్రసాద్‌ల కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా. కాగా అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అద్భుతంగా ఉన్న టీజర్ రిలీజ్ చేశారు. 


ఈ టీజర్‌లో అల్లు అర్జున్ మేకోవర్ సూపర్బ్ అంటూ ఇంత మాస్ మేకోవర్‌తో ఇప్పటి వరకు అల్లు అర్జున్ కనిపించలేదంటూ చెప్పుకుంటున్నారు. ఇక సుకుమార్ అల్లు అర్జున్‌ని ఏ రేంజ్‌లో చూపించబోతున్నాడో ఈ టీజర్‌తో అందరికీ క్లారిటీ వచ్చేసింది. పాన్ ఇండియన్ సినిమా అంటే ఇదీ.. అంటూ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. టీజర్‌లో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ మాదిరిగా 'తగ్గేదే లే' అన్నట్టు ఉంది 'పుష్ప' టీజర్. కాగా మెగాస్టార్ ఈ టీజర్ చూసి తనదైన స్టైల్‌లో విసెష్ చెప్తూ 'అల్లు అర్జున్ తగ్గేదే లే' అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  



Updated Date - 2021-04-08T16:59:11+05:30 IST