వీలైతే డబుల్‌ మాస్క్‌ ధరించండి! చిరంజీవి

ABN , First Publish Date - 2021-05-15T04:19:03+05:30 IST

వీలైతే డబుల్‌ మాస్క్‌ ధరించండి! చిరంజీవి

వీలైతే డబుల్‌ మాస్క్‌ ధరించండి! చిరంజీవి

‘‘కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రంగా ఉంది. తప్పని పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ లాక్‌డౌన్‌ విధించారు. ఇప్పుడైనా అలక్ష్యం చేయకుండా, ఇంటి పట్టున ఉండండి. అత్యవసరమై బయటకొస్తే... తప్పనిసరిగా మాస్క్‌ ధరించండి. వీలైతే డబుల్‌ మాస్క్‌ ధరించండి’’ అని చిరంజీవి విజ్ఞప్తి చేశారు. వైరస్‌ కంటే ఎక్కువ భయమే చంపేస్తోందనీ, అందువల్ల కొవిడ్‌ బారిన పడినవాళ్లు భయపడవద్దనీ, లాక్‌డౌన్‌లోనూ వ్యాక్సినేషన్‌ కొనసాగుతుంది కనుక అందరూ రిజిస్ట్రేషన్‌ చేసుకుని టీకా తీసుకోవాలని ఆయన కోరారు. ‘‘కరోనా నుంచి కోలుకున్నాక, ఓ నెలలో యాంటీబాడీస్‌ తయారవుతాయి. అప్పుడు ప్లాస్మా దానం చేయండి. మరో ఇద్దర్ని కాపాడండి’’ అని చిరంజీవి అభ్యర్ధించారు.

Updated Date - 2021-05-15T04:19:03+05:30 IST