‘పుష్ప’ దర్శకుడు సుకుమార్‌‌కు మెగాస్టార్ అభినందనలు

ABN , First Publish Date - 2021-12-28T01:24:51+05:30 IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఇంకా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూనే ఉంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన

‘పుష్ప’ దర్శకుడు సుకుమార్‌‌కు మెగాస్టార్ అభినందనలు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఇంకా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూనే ఉంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం.. రిలీజ్ అయిన అన్ని చోట్లా ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలను అందుకుంటోంది. తాజాగా ఈ చిత్ర దర్శకుడు సుకుమార్‌ని మెగాస్టార్ చిరంజీవి అభినందనలతో ముంచెత్తారు. ఇటీవల ఈ చిత్రాన్ని వీక్షించిన చిరంజీవి.. దర్శకుడు సుకుమార్‌ను ప్రత్యేకంగా ఇంటికి ఆహ్వానించి అభినందించారు. 


‘పుష్ప’ చిత్రం తనకెంతో నచ్చిందని, అన్ని భాషల్లో పుష్పకు లభిస్తున్న ఆదరణ పట్ల ఎంతో ఆనందంగా ఉందని చిరు తెలిపారు. సినిమాలో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ నటన చక్కగా ఉందని, సినిమాలోని ప్రతి అంశం ఎంతో అద్భుతంగా ఉందని, దర్శకుడుగా సుకుమార్ పడిన తపన, కష్టం ప్రతి ఫ్రేములో కనిపించిందని, అందుకు తగ్గ ప్రతిఫలం ఇలా బ్లాక్‌బస్టర్ రూపంలో వచ్చిందని చిరంజీవి కొనియాడారు. ప్రస్తుతం సుకుమార్‌ని చిరంజీవి అభినందిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.Updated Date - 2021-12-28T01:24:51+05:30 IST