‘జాంబీ రెడ్డి’ ఫంక్షన్‌కి గెస్ట్‌గా మెగా హీరో

ABN , First Publish Date - 2021-02-02T03:48:09+05:30 IST

డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా రూపొందిన చిత్రం 'జాంబీ రెడ్డి'. ఆనంది, ద‌క్ష హీరోయిన్లుగా న‌టించారు. యాపిల్ ట్రీ స్టూడియోస్‌ బ్యానర్‌పై

‘జాంబీ రెడ్డి’ ఫంక్షన్‌కి గెస్ట్‌గా మెగా హీరో

డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా రూపొందిన చిత్రం 'జాంబీ రెడ్డి'. ఆనంది, ద‌క్ష హీరోయిన్లుగా న‌టించారు. యాపిల్ ట్రీ స్టూడియోస్‌ బ్యానర్‌పై రాజ‌శేఖ‌ర్ వ‌ర్మ‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 5న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌ ఫిబ్రవరి 2వ తేదీన ప్రీ రిలీజ్‌ కార్యక్రమాన్ని గ్రాండ్‌గా నిర్వహించేందుకు రెడీ అయింది. ఈ వేడుకకు మెగా హీరో అతిథిగా రాబోతున్నట్లుగా చిత్రయూనిట్‌ అధికారికంగా తెలియజేసింది. మెగా ప్రిన్‌ వరుణ్‌ తేజ్‌ ముఖ్య అతిథిగా ఈ వేడుక జరుగనుంది.


ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ''టాలీవుడ్‌కు జాంబీ కాన్సెప్ట్‌ను ప‌రిచ‌యం చేస్తూ హై-కాన్సెప్ట్ ఫిల్మ్‌తో మీ ముందుకు వ‌స్తున్నాం. క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో వ‌స్తున్న తొలి చిత్రం 'జాంబీ రెడ్డి' కావ‌డం గ‌మ‌నార్హం. ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన వాటన్నింటికీ అద్భుతమైన స్పందన వచ్చింది. మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ ముఖ్య అతిథిగా ప్రీ రిలీజ్‌ వేడుకను గ్రాండ్‌గా జరుపబోతున్నాం. చిత్రాన్ని ఫిబ్రవరి 5న విడుదలచేయనున్నాం..'' అని తెలిపారు.

Updated Date - 2021-02-02T03:48:09+05:30 IST